Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsviralక్రైంజాతీయం

Viral : ఒకే ఇంటికి మూడోసారి చోరీకి వెళ్ళిన దొంగ.. బెడ్ రూమ్ లో దంపతులను నగ్నంగా చూసి.. చివరకు ఇలా..!

Viral : ఒకే ఇంటికి మూడోసారి చోరీకి వెళ్ళిన దొంగ.. బెడ్ రూమ్ లో దంపతులను నగ్నంగా చూసి.. చివరకు ఇలా..!

మన సాక్షి , వెబ్ డెస్క్:

దొంగలు చోరీలకు పాల్పడుతుంటారు. కానీ ఆ దొంగ మాత్రం ఆ ఇంటికి మూడోసారి చోరీకి వెళ్ళాడు. అయినా కూడా చోరీ సందర్భంలో నగలు, నగదు, ఇంకా ఇతర వస్తువులు ఎత్తుకెళ్లడం సర్వసాధారణం. కొంతమంది దొంగలు బెదిరించి చోరీలు చేస్తుంటారు. కానీ ఈ దొంగ విచిత్రం ఏంటంటే తెలుసుకుందాం..

ఛత్తీస్గఢ్ లో ఓచోట జరిగిన ఈ సంఘటన చూస్తుంటే ఆ దొంగ చేసిన నిర్వాకం ఏంటో తెలుస్తుంది. ఒక దొంగ ఓకే ఇంటిలోకి మూడోసారి చోరీకి వెళ్ళాడు. చివరికి ఆ ఇంట్లోని బెడ్ రూమ్ వైపు వెళ్ళాడు. లోపల దంపతులు నగ్నంగా ఉండటం చూసి అతను చేసిన నిర్వాకం ఏంటో సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అవుతుంది.

ఛత్తీస్గడ్ లోని దుర్గ్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. సాహూ జిల్లాలోని నందిని పోలీస్ స్టేషన్ పరిధిలో అహివర గ్రామానికి చెందిన వినయ్ కుమార్ సాహు అనే వ్యక్తి చోరీలకు అలవాటు పడ్డాడు. ఆ క్రమంలో దుర్గ్ జిల్లాలో ఓ ఇంటిలోకి దొంగతనానికి వెళ్ళాడు. ఆ ఇంట్లోనే వరుసగా ఇప్పటికే రెండుసార్లు చోరీలకు పాల్పడ్డాడు. మరోసారి కూడా చోరీకి వెళ్ళాడు.

 

ALSO READ : Pavan Kalyan: కోరిక నెరవేరింది.. తెలంగాణలో మొక్కు చెల్లించుకున్న పవన్ కళ్యాణ్..!

 

అయితే ఆ సమయంలో అతను బెడ్ రూమ్ వైపు వెళ్ళాడు. లోపల నగ్నంగా ఉన్న దంపతులను చూసి అవాక్కయ్యాడు. వెంటనే తన కొచ్చిన నిర్వాక ఆలోచన ఏంటంటే..? తన ఫోన్లో వీడియో తీశాడు. తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు. జూన్ 17వ తేదీన సదరు ఇంటి యజమాని వాట్సాప్ నెంబర్ కు ఆ వీడియోలు పంపించాడు. 10 లక్షల నగదు రూపాయలు ఇవ్వాలని, ఇవ్వకుంటే వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు.

దాంతో భయపడిపోయిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని జూన్ 25వ తేదీన నిందితుడిని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి మూడు మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.

నిందితుడు ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి సివిల్ సర్వీస్ పరీక్షలు కూడా రాస్తున్నాడు. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా గవర్నమెంట్ ఉద్యోగం రాకపోవడంతో చివరికి చోరీలకు పాల్పడుతున్నాడు. ఉద్యోగం రాకపోవడంతో చోరీలకు పాల్పడటం అలవాటుగా మారిందని తను చెప్పడం.. ఈ ఘటన వైరల్ గా మారింది.

ALSO READ : 

Swarnagiri : ఏ నోట విన్నా స్వర్ణగిరి దేవాలయమే.. ప్రత్యేకతలు ఏంటో మీరూ చూడండి..!

Runamafi : రుణమాఫీ పై సీఎం రేవంత్ రెడ్డి మరో ప్రకటన.. కీలక అప్ డేట్..!

WhatsApp : ఆ 35 ఫోన్లకు వాట్సప్ సేవలు బంద్.. జాబితాలో మీ ఫోన్ ఉందా.. చూసుకోండి..!

KCR : బండ్లు ఓడలు.. ఓడలు బండ్లు, ఢిల్లీలో చక్రం తిప్పబోయి.. ఫాఫం కేసిఆర్..!

మరిన్ని వార్తలు