WhatsApp : ఆ 35 ఫోన్లకు వాట్సప్ సేవలు బంద్.. జాబితాలో మీ ఫోన్ ఉందా.. చూసుకోండి..!
WhatsApp : ఆ 35 ఫోన్లకు వాట్సప్ సేవలు బంద్.. జాబితాలో మీ ఫోన్ ఉందా.. చూసుకోండి..!
మన సాక్షి :
వాట్సప్ మెసేజ్ యాప్ ను ప్రపంచంలోనే కోట్లాదిమంది వినియోగిస్తున్నారు. భద్రత కారణాల రిత్యా ఈ మెసేజ్ వాట్సాప్ యాప్ లో అనేక కొత్త కొత్త ఫీచర్స్ రోజురోజుకు వస్తున్నాయి. సెక్యూరిటీ కారణంగా అనేక అప్డేట్స్ ఎప్పటికప్పుడు విడుదల చేస్తుంది.
ఈ క్రమంలోనే పాత ఫోన్ మోడల్స్ కు వాట్సాప్ సేవలను నిలిపివేస్తూ ఉంటుంది. అందుకుగాను సరికొత్తగా 35 ఫోన్ మోడల్స్ కు వాట్సాప్ సేవలను త్వరలో నిలిపి వేస్తున్నట్లు ఆ సంస్థ తాజాగా ప్రకటించింది.
రాబోయే రోజుల్లో మరిన్ని మోడల్స్ లో కూడా సేవలు నిలిచిపోతాయని హెచ్చరించింది. వాట్సాప్ సేవలు నిలిచిపోయే ఫోన్ల జాబితాలో కెనాల్ టెక్ సంస్థ తాజాగా విడుదల చేసింది. ప్రముఖ బ్రాండ్లకు సంబంధించిన 35 రకాల మోడల్స్ కు వాట్సాప్ సేవలు నిలిచిపోతాయని లిస్టును విడుదల చేసింది.
వాట్సాప్ సేవలో నిలిచిపోయే ప్రముఖ బ్రాండ్ కంపెనీల ఫోన్ల వివరాలు :
శామ్సంగ్ : గెలాక్సీ ఎస్ ప్లస్, గెలాక్సీ కోర్, గెలాక్సీ ఎక్స్ప్రెస్ 2, గెలాక్సీ గ్రాండ్, గెలాక్సీ నోట్3, గెలాక్సీ s3 మినీ, గెలాక్సీ s4 ఆక్టివ్, గెలాక్సీ s4 మిని, గెలాక్సీ s4 జూమ్
మోటోరోలా : మోటో జీ , మోటో ఎక్స్,
యాపిల్ : ఐఫోన్ 5, ఐఫోన్ 6, ఐ ఫోన్ సిక్స్ ఎస్, ఐ ఫోన్ సిక్స్ ఎస్ ప్లస్, ఐఫోన్ ఎస్ ఇ,
హువావే : ఎసెంట్ పి 6, ఎసెండ్ జి 525, హువావే సి 199, హూవావే జి ఎక్స్1 ఎస్, హువావే వై 625,
లెనోవా : లెనోవా 46600, లెనోవా ఏ 858 టి, లెనోవా సీ 70, లెనోవా ఎస్ 890,
సోనీ : ఎక్స్పీరియా జీ1, ఎక్స్పీరియా ఈ3,
ఎల్ జీ : ఆప్టిమస్ ఫోర్ ఎక్స్ హెచ్ డి, ఆప్టిమస్ జి, ఆప్టిమస్ జి ప్రో , ఆప్టిమస్ ఎల్ 7.
ఈ ఫోన్ లలో వాట్సాప్ సేవలు రానున్న రోజుల్లో నిలిచిపోతాయని వాట్సప్ పేర్కొన్నది. కొత్త డివైస్ లకు సంబంధించి అప్డేట్ కావాలని సూచనలు చేసింది. సపోర్ట్ లేని డివైస్ లతో భద్రతకు సంబంధించిన సమస్యలు ఎదురవుతాయని పేర్కొన్నది.
ALSO READ :
Job Mela : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 65 కంపెనీలతో మెగా జాబ్ మేళా..!
Miryalaguda : మిర్యాలగూడలో నాలుగు చోట్ల ఫ్లైఓవర్ల నిర్మాణం.. జంక్షన్ లను పరిశీలించిన ఎమ్మెల్యే..!
TGSRTC : ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ సమస్య ఉండదు..!










