Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఅభివృద్దిజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : మిర్యాలగూడలో నాలుగు చోట్ల ఫ్లైఓవర్ల నిర్మాణం.. జంక్షన్ లను పరిశీలించిన ఎమ్మెల్యే..!

Miryalaguda : మిర్యాలగూడలో నాలుగు చోట్ల ఫ్లైఓవర్ల నిర్మాణం.. జంక్షన్ లను పరిశీలించిన ఎమ్మెల్యే..!

మిర్యాలగూడ మన సాక్షి :

మిర్యాలగూడ పట్టణంలో రోడ్డు ప్రమాదాల నివారణకు గాను నాలుగు చోట్ల ఫ్లైఓవర్ ల నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే భత్తుల లక్ష్మారెడ్డి తెలంగాణ రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దృష్టికి రోడ్డు ప్రమాదాల విషయాన్ని తీసుకెళ్లారు. దాంతో మంత్రి సానుకూలంగా స్పందించి నాలుగు చోట్ల ఫ్లైఓవర్ ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా బుధవారం ఆర్ అండ్ బి ఈఎన్ సి, జాతీయ రహదారుల అధికారులతో పాటు ఆర్డిఓ, తాసిల్దార్లతో కలిసి ఫ్లై ఓవర్ల నిర్మాణం చేపట్టే జంక్షన్ లను పరిశీలించారు.

అనంతరం ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మిర్యాలగూడ పట్టణంలో రోడ్డు ప్రమాదాల నివారణ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లగా నాలుగు చోట్ల ఫ్లై ఓవర్ల నిర్మాణానికి మంజూరు చేసినట్లు తెలిపారు. మిర్యాలగూడ పట్టణంలోని అద్దంకి – నార్కట్ పల్లి రహదారి నుంచి మిర్యాలగూడలోకి వచ్చే వైద్య జంక్షన్ వద్ద ఒక ఫ్లై ఓవర్, నందిపాడు బైపాస్ వద్ద ఒక ఫ్లై ఓవర్, చింతపల్లి బైపాస్ వద్ద ఒక ఫ్లైఓవర్, ఈదుల గూడ జంక్షన్ వద్ద మరో ఫ్లైఓవర్ నిర్మాణం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.

అదేవిధంగా వేములపల్లి క్యాంపు వద్ద ప్రజలు రోడ్డు దాటేందుకు ఇబ్బంది పడుతూ ప్రమాదాలకు గురవుతున్న విషయాన్ని గుర్తించామని అక్కడ అండర్ గ్రౌండ్ పాసేజ్ నిర్మాణం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. కోరిన వెంటనే మిర్యాలగూడకు ఫ్లై ఓవర్లు మంజూరు చేసిన రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. అతి త్వరలో ఫ్లై ఓవర్ల నిర్మాణం పూర్తి చేయాలని, హైవే పరిధిలో ఉన్న ప్రతి చోటా సర్వీస్ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణాలు పూర్తి చేయాలని కోరారు.

ALSO READ: 

Whatsspp : వాట్సాప్ లో అదిరిపోయే మెటా ఏఐ ఫీచర్.. తెలియని విషయాలు సెకండ్లలో తెలుసుకోవచ్చు..!

RTC : మహిళలకు బంపర్ ఆఫర్.. ఆర్టీసీ ప్రయాణికులకు బహుమతులు..!

Oil palm cultivation : ఆయిల్ పామ్ తోటల సాగుతో అధిక ఆదాయం.. 80 నుంచి 100 శాతం ప్రభుత్వం రాయితీ..!

BIG ALERT: వారందరికీ రేషన్ కార్డులు, ఆసరా పెన్షన్లు కట్.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..!

మరిన్ని వార్తలు