Oil palm cultivation : ఆయిల్ పామ్ తోటల సాగుతో అధిక ఆదాయం.. 80 నుంచి 100 శాతం ప్రభుత్వం రాయితీ..!

ఆయిల పామ్ తోటల సాగుతో అధిక ఆదాయం పొందవచ్చు అని పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ ఆయిల్ పామ్ కంపనీ డివిజనల్ మేనేజర్ యాదగిరి తుంగతుర్తి ఉద్యాన అధికారి వి.స్రవంతిలు అన్నారు.తుంగతుర్తి మండల కేంద్రం లో ని రాంరెడ్డి దామోదర్ రెడ్డి నూతనంగా సాగు చేస్తున్నటువంటి ఆయిల్ పామ్ తోటను క్షేత్ర సందర్శన చేయడం జరిగింది.

Oil palm cultivation : ఆయిల్ పామ్ తోటల సాగుతో అధిక ఆదాయం.. 80 నుంచి 100 శాతం ప్రభుత్వం రాయితీ..!

తుంగతుర్తి, మన సాక్షి:

ఆయిల పామ్ తోటల సాగుతో అధిక ఆదాయం పొందవచ్చు అని పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ ఆయిల్ పామ్ కంపనీ డివిజనల్ మేనేజర్ యాదగిరి తుంగతుర్తి ఉద్యాన అధికారి వి.స్రవంతిలు అన్నారు.తుంగతుర్తి మండల కేంద్రం లో ని రాంరెడ్డి దామోదర్ రెడ్డి నూతనంగా సాగు చేస్తున్నటువంటి ఆయిల్ పామ్ తోటను క్షేత్ర సందర్శన చేయడం జరిగింది.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మార్కెట్లో డిమాండ్ ఉన్న అయిల్ పామ్ తోటలను సాగు చేసి రైతులు ఆర్థికoగా అభివృద్ధి చెందవచ్చు అని తెలిపారు..ఆయిల్ పామ్ తోటనాటిన నాలుగవ సంవత్సరం నుంచి దిగుబడి ప్రారంభమవుతుంది అని తెలిపారు. ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు ప్రభుత్వం డ్రిప్పుకి, ఎరువులకి, అంతర పంటలకు రాయితీలు ఇస్తుంది. ఎస్సీ ఎస్టీ రైతులకు 100 శాతం బీసీ సన్న చిన్న కారు రైతులకు 90 శాతం ఇతర కేటగిరి రైతులకు 80 శాతం రాయితీ కలదు.

ఎరువులు మరియు అంతర పంటల యాజమాన్యానికి ఒక ఎకరానికి రూపాయలు 4200/- చొప్పున మొదటి నాలుగు సంవత్సరాలు ప్రోత్సాహకం ఇవ్వబడును. గరిష్టంగా ఒక రైతుకు 12:50 ఎకరాల వరకు డ్రిప్పు రాయితీ వర్తిస్తుంది.. నమ్మకమైన నీటి వసతి గల రైతులు లాభదాయకమైన ఆయిల్ పామ్ పంటను సాగు చేసి, అధిక ఆదాయం పొందవచ్చునని తెలిపారు.

ఒక ఎకరానికి దిగుబడి పది టన్నుల వరకు వస్తుంది.. మొదటి నాలుగు సంవత్సరాల వరకు అంతర పంటలుగా ప్రస్తుతం మార్కెట్లో బాగా డిమాండ్ ఉన్న కూరగాయలను సాగు చేయాలని రైతులకు సూచించారు.. ఆయిల్ పామ్ తోటలు సాగు చేయాలనుకున్న

ఆసక్తి గల రైతులు ఉద్యాన శాఖ వారికి దరఖాస్తు చేయగలరు. ఈ కార్యక్రమంలో పతంజలి ఆయిల్ పామ్ కంపనీ సూర్యాపేట జిల్లా మేనేజర్ హరీష్, ఫీల్డ్ ఆఫీసర్ అశోక్, ఫీల్డ్ అసిస్టెంట్ భద్రాచలం రైతులు రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : 

Mahalakshmi: ప్రతి మహిళకు నెలకు ₹2500 ఎప్పటినుంచంటే.. మీరు అర్హులేనా..?

BIG ALERT: వారందరికీ రేషన్ కార్డులు, ఆసరా పెన్షన్లు కట్.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..!

POSTAL: పోస్టల్ శాఖలో 50వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్, రాత పరీక్ష లేకుండా ఎంపిక..!