RTC : మహిళలకు బంపర్ ఆఫర్.. ఆర్టీసీ ప్రయాణికులకు బహుమతులు..!

మహిళా ప్రయాణికులకు ఆర్టీసీ బంపర్ ఆఫర్ పెట్టింది. ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ బస్సులలో ప్రయాణించే మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పిస్తున్న విషయం తెలిసిందే.  కాగా డీలక్స్ బస్సుల్లో ప్రయాణించే మహిళల కోసం బంపర్ ఆఫర్ పెట్టింది.

RTC : మహిళలకు బంపర్ ఆఫర్.. ఆర్టీసీ ప్రయాణికులకు బహుమతులు..!

దేవరకొండ, మనసాక్షి :

మహిళా ప్రయాణికులకు ఆర్టీసీ బంపర్ ఆఫర్ పెట్టింది. ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ బస్సులలో ప్రయాణించే మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పిస్తున్న విషయం తెలిసిందే.  కాగా డీలక్స్ బస్సుల్లో ప్రయాణించే మహిళల కోసం బంపర్ ఆఫర్ పెట్టింది.

దేవరకొండ ఆర్టీసీ డిపో పరిధిలో నడుస్తున్న డీలక్స్ బస్సుల్లో ప్రయాణించే మహిళా ప్రయాణికులకు బహుమతులు అందజేయనున్నట్లు అసిస్టెంట్ మేనేజర్ సైదులు మంగళవారం తెలిపారు. దేవరకొండ నుంచి హైదరాబాద్- మాచర్ల రూట్లో నడిచే 4 డీలక్స్ బస్సుల్లో గిఫ్ట్ బాక్స్ లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

మహిళా ప్రయాణికులు తమ ప్రయాణం పూర్తయిన తర్వాత టికెట్ వెనకాల పేరు,ఫోన్ నెంబర్ రాసి గిఫ్ట్ బాక్స్ లో వేయాలని కోరారు. 15 రోజులకు ఒకసారి డ్రా తీసి ముగ్గురు ప్రయాణికులకు బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. దేవరకొండలోని విశ్వేశ్వర క్లాత్ షోరూం వారి సహకారంతో బహుమతులను అందిస్తామని పేర్కొన్నారు. మహిళా ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ALSO READ : 

BIG ALERT: వారందరికీ రేషన్ కార్డులు, ఆసరా పెన్షన్లు కట్.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..!

Telangana : ఆగస్టు 1నుంచి భూములకు కొత్త రేట్లు.. ఎకరా ధర ఎంతంటే..?

Congress: కాంగ్రెస్ పార్టీలో చేరికల చిచ్చు.. తెలంగాణలో ఏం జరుగుతోంది..!