Congress: కాంగ్రెస్ పార్టీలో చేరికల చిచ్చు.. తెలంగాణలో ఏం జరుగుతోంది..!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది. 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పాలనపై దృష్టి పెట్టడంతో పాటు పార్టీ బలోపేతానికి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారా..? లేదా సీనియర్లకు జలక్ ఇచ్చేందుకు ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటున్నారా..? అనే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Congress: కాంగ్రెస్ పార్టీలో చేరికల చిచ్చు.. తెలంగాణలో ఏం జరుగుతోంది..!

మన సాక్షి,

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది. 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పాలనపై దృష్టి పెట్టడంతో పాటు పార్టీ బలోపేతానికి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారా..? లేదా సీనియర్లకు జలక్ ఇచ్చేందుకు ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటున్నారా..? అనే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

కాంగ్రెస్ పార్టీకి సరైన బలం ఉన్నప్పటికీ కూడా చేరికలను ప్రోత్సహిస్తున్నారు. ముఖ్యమంత్రి స్వయంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇంటికి వెళ్లి వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి చేర్చుకోవడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇటీవల పోచారం శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం పట్ల ఆ పార్టీ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి వ్యతిరేకించారు. ఇదిలా ఉండగా జగిత్యాల ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రత్యర్థి సంజయ్ ని కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. దాంతో జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ నాయకులు బగ్గుమంటున్నారు.

కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అంతా జీవన్ రెడ్డి ఇంటికి చేరి పార్టీలో ఏం జరుగుతుందని చర్చిస్తున్నారు. 10 సంవత్సరాలపాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అనేక ఇబ్బందులకు గురిచేసిన ఎమ్మెల్యే సంజయ్ ని కాంగ్రెస్ లో చేర్చుకోవడం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇంకా రాష్ట్రవ్యాప్తంగా మరో 20 మంది వరకు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని చర్చ జోరుగా సాగుతుంది. బీఆర్ఎస్ కు 39 మంది ఎమ్మెల్యేలు ఉండగా ఇప్పటికే ఐదారుగరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

ఇంకా 15 నుంచి 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటే బీఆర్ఎస్ పార్టీ కనుమరుగ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ లో సీనియర్ల వ్యతిరేకత ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకోవడాన్ని సీనియర్ నాయకులు వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ గడ్డు పరిస్థితిలో ఉన్న సమయంలో ఆదుకున్న నాయకులను పక్కకు పెట్టి కొత్తవారిని చేర్చుకోవడం ఏంటని సీనియర్ నాయకులు ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీలోకి జోరుగా వలసలు కొనసాగుతున్నాయి. చివరికి ఏమవుతుందో వేచి చూడాలి.

ALSO READ ; 

BIG ALERT: వారందరికీ రేషన్ కార్డులు, ఆసరా పెన్షన్లు కట్.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..!

POSTAL: పోస్టల్ శాఖలో 50వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్, రాత పరీక్ష లేకుండా ఎంపిక..!

HYDERABAD : సంచలనం కలిగించిన బురఖా దొంగలు..కేసు ఛేదించిన సైబరాబాద్ పోలీసులు..!