Telangana : ఆగస్టు 1నుంచి భూములకు కొత్త రేట్లు.. ఎకరా ధర ఎంతంటే..?

తెలంగాణలో భూముల రేట్లు పెరగనున్నాయి. ఈ ప్రక్రియ ఈనెల 29వ తేదీతో పూర్తి కానున్నది. ఆగస్టు ఒకటో తేదీ నుంచి కొత్త రేట్లు అమలులోకి రానున్నాయి. క్షేత్రస్థాయి కమిటీలు భూమి విలువలను నిర్ధారించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపనున్నారు.

Telangana : ఆగస్టు 1నుంచి భూములకు కొత్త రేట్లు.. ఎకరా ధర ఎంతంటే..?

Mana Sakshi :

తెలంగాణలో భూముల రేట్లు పెరగనున్నాయి. ఈ ప్రక్రియ ఈనెల 29వ తేదీతో పూర్తి కానున్నది. ఆగస్టు ఒకటో తేదీ నుంచి కొత్త రేట్లు అమలులోకి రానున్నాయి. క్షేత్రస్థాయి కమిటీలు భూమి విలువలను నిర్ధారించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపనున్నారు.

రాష్ట్రంలో భూముల ధరలు భారీగా పెరగనున్నాయి. ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువల సవరణ ప్రక్రియ చివరి దశకు చేరింది. ఆగస్టు 1వ తేదీ నుంచి కొత్త రిజిస్ట్రేషన్ రేట్లు అమలులోకి రానున్నట్లు సమాచారం. రిజిస్ట్రేషన్ విలువలను సవరించే ప్రక్రియలో భాగంగా భూములను మూడు కేటగిరీలుగా నిర్ధారించారు. గ్రామాల్లోని వ్యవసాయ భూములు, రాష్ట్ర, జాతీయ రహదారుల పక్కన ఉండే వ్యవసాయ భూములు, వెంచర్లు.. ఇలా మూడు కేటగిళ్ళను నిర్ధారించారు.

కాగా రాష్ట్రంలోని ఎకరా వ్యవసాయ భూమి కనీస ధరను 4 లక్షల రూపాయలుగా నిర్ధారించారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు ఏజెన్సీలు మినహా మిగతా ప్రాంతాల్లోనూ ఎకరా నాలుగు లక్షల రూపాయల ధర ఉండే అవకాశం ఉంది. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారుల పక్కన ఉండే భూమి ధర 40 లక్షల రూపాయల నుంచి 50 లక్షల రూపాయల వరకు పెంచనున్నారు. వెంచర్లు ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉంటే ఎకరా ధర ఒక కోటి రూపాయలు ఉండే అవకాశాలు ఉన్నాయి.

నివాస స్థలాలలో స్క్వేర్ యాడ్ కు 1000 రూపాయలు, అపార్ట్మెంట్లలో స్క్వేర్ ఫీట్ కు 1500 రూపాయలుగా ధర నిర్ణయించినట్లు తెలిసింది. ఏజెన్సీ ప్రాంతాలలో చదరపు గజం కనీసం విలువ 500 రూపాయలుగా ప్రతిపాదించినట్లు సమాచారం. మార్కెట్ ప్రభుత్వ విలువల మధ్య బాగా వ్యత్యాసం ఉన్నచోట భారీగా రేట్లు పెంచే అవకాశం ఉంది.

భూముల రేట్ల సవరణ ప్రక్రియ ఈనెల 29వ తేదీతో ముగియనున్నది. క్షేత్రస్థాయి కమిటీలు భూ విలువలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపిన అనంతరం ప్రభుత్వ వెబ్ సైట్లో అప్లోడ్ చేసి ప్రజల అభిప్రాయాలు, అభ్యంతరాలను కూడా స్వీకరిస్తారు. ఆ తర్వాత మార్పులు, చేర్పులు చేసి ఆగస్టు ఒకటి నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విలువలను అమలులోకి తీసుకొచ్చేందుకు స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ సిద్ధమవుతోంది.

ALSO READ : 

Mahalakshmi: ప్రతి మహిళకు నెలకు ₹2500 ఎప్పటినుంచంటే.. మీరు అర్హులేనా..?

POSTAL: పోస్టల్ శాఖలో 50వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్, రాత పరీక్ష లేకుండా ఎంపిక..!

Free Coaching : సివిల్స్ లాంగ్ టర్మ్ ఉచిత శిక్షణ.. డిగ్రీ పాసైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ వారి నుంచి దరఖాస్తులకు ఆహ్వానం..!