Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIEStravelతెలంగాణ

TGSRTC : ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ సమస్య ఉండదు..!

TGSRTC : ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ సమస్య ఉండదు..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ ఆర్టీసీ కొత్త విధానాన్ని అమలు చేయబోతుంది. ప్రయాణికుల కు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా నూతన విధానాన్ని అమలు చేయబోతోంది. ఆర్టీసీ బస్సులలో ప్రయాణించే వారికి చిల్లర సమస్య వస్తుంది. అటు ప్రయాణికులు ఇటు కండక్టర్లు చిల్లర లేక నానా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చింది.

మహిళా ప్రయాణికులకు జీరో టికెట్ అమలవుతుంది. దాంతో ప్రయాణీకుల తాకిడి కూడా ఎక్కువ అయింది. పురుషులు టికెట్లకు డబ్బులు చెల్లించాల్సి వస్తున్నప్పటికీ చిల్లర సమస్య ఎదురవుతుంది. దానిని చెక్ పెట్టేందుకు టీజీఎస్ఆర్టిసి సిద్ధమయింది.

ఆర్టీసీ బస్సులలో యూపీఐ పేమెంట్స్ విధానాన్ని ప్రారంభించబోతున్నారు. టికెట్ కు సరిపడ డబ్బులను యూపీఐ ద్వారా ఫోన్ పే, గూగుల్ పే, డెబిట్, క్రెడిట్ కార్డులతో స్వైపింగ్ లాంటి డిజిటల్ పేమెంట్స్ సౌకర్యాలు తీసుకురాబోతున్నారు.

ఇప్పటికే హైదరాబాద్ నగరంలో బండ్లగూడ డిపో పరిధిలో 70 బస్సులలో పైలట్ ప్రాజెక్టు కింద డిజిటల్ పేమెంట్స్ విధానాన్ని అమలు చేస్తున్నారు. దీనిని అధికారులు పూర్తిగా పరిశీలిస్తారు. ఆ డిపో పరిధిలో ప్రస్తుతం 20 రోజులు నుంచి కండక్టర్లు డిజిటల్ టికెట్ల జారీ ప్రక్రియ చేస్తున్నారు. యంత్రాల పనితీరు, క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడంలో లోపాలను అధికారులు పరిశీలిస్తున్నారు.

ఎలాంటి ఇబ్బందులు తలెత్తకపోవడంతో హైదరాబాద్ నగరవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపుల ప్రక్రియను ప్రారంభించేందుకు తెలంగాణ ఆర్టీసీ సిద్ధమవుతోంది. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా కూడా డిజిటల్ చెల్లింపుల ప్రక్రియను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. దీంతో ప్రయాణికులకు కండక్టర్లకు కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు లేవు.

ALSO READ :

Miryalaguda : మిర్యాలగూడలో నాలుగు చోట్ల ఫ్లైఓవర్ల నిర్మాణం.. జంక్షన్ లను పరిశీలించిన ఎమ్మెల్యే..!

Mahalakshmi: ప్రతి మహిళకు నెలకు ₹2500 ఎప్పటినుంచంటే.. మీరు అర్హులేనా..?

POSTAL: పోస్టల్ శాఖలో 50వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్, రాత పరీక్ష లేకుండా ఎంపిక..!

మరిన్ని వార్తలు