రావులపెంటలో వైభవంగా శ్రీ ముత్యాలమ్మ తల్లి బోనాల పండుగ..!
వేములపల్లి మండలం రావులపెంట గ్రామంలోని గురువారం శ్రీముత్యాలమ్మ తల్లి బోనాల పండగను అంగరంగ వైభవంగా నిర్వహించారు.

రావులపెంటలో వైభవంగా శ్రీ ముత్యాలమ్మ తల్లి బోనాల పండుగ..!
– భక్తులతో కిటకిటలాడిన ఆలయ ప్రాంగణం
– అమ్మవారికి పెద్ద ఎత్తున మొక్కులు చెల్లించుకున్న గ్రామస్తులు
వేములపల్లి,, మన సాక్షి:
వేములపల్లి మండలం రావులపెంట గ్రామంలోని గురువారం శ్రీముత్యాలమ్మ తల్లి బోనాల పండగను అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు తెల్లవారుజాము నుంచి ముత్యాలమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించారు. దీంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. మొదటగా అమ్మవారికి ఆనవాయితీగా వస్తున్న చల్లా సీతారాం రెడ్డి వారసులైన వారి కుటుంబం నుంచి మొదటి బోనం అమ్మవారికి నైవేద్యం సమర్పించారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సందరబోయిన చంద్రయ్య అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ముత్యాలమ్మ అమ్మవారి ఆశీస్సులతో గ్రామ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతీక అన్నారు. అనంతరం గ్రామ ప్రజలు వనమాసాలకు వెళ్లారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పల్లా గోవర్ధన్, మాజీ ఎంపీటీసీ నంద్యాల శ్రీరామ్ రెడ్డి,మాజీ ఉప సర్పంచ్ తరి సైదులు,వార్డు మెంబర్లు,మాజీ వార్డ్ మెంబర్స్, నాయకులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.










