వెనకడుగు వేసేది లేదు.. భారీ మెజారిటీతో విజయం సాధిస్తా.. రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి..!
పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి భారీ మెజారిటీతో విజయం సాధిస్తానని రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి అన్నారు.

వెనకడుగు వేసేది లేదు.. భారీ మెజారిటీతో విజయం సాధిస్తా.. రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి..!
అర్వపల్లి, మన సాక్షి
పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి భారీ మెజారిటీతో విజయం సాధిస్తానని రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి అన్నారు. శనివారం అర్వపల్లి మండల కేంద్రంలోని శ్రీ యోగానంద లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానంలో ప్రత్యేక ప్రార్థన అనంతరం విలేకరులతో మాట్లాడారు.
మల్లికార్జున కార్గే, రాహుల్, సోనియా, కేసి వేణుగోపాల్, రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, ఉత్తంకుమార్ రెడ్డి, వెంకట్ రెడ్డి, లు నా మీద నమ్మకంతో మా మా తండ్రిగారి సేవలను గుర్తించి తనకు టికెట్ కేటాయించినట్లు తెలిపారు.
అర్వపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం మా ఇంటికి ఇలవేల్పుగా ఉందని, ఏ కార్యక్రమంలో నిర్వహించిన, ఇక్కడినుండే ప్రారంభిస్తామని అన్నారు. మూడు జిల్లాలు 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్న ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఖచ్చితంగ గేలుసుకుంటామని అన్నారు.
కొంతమంది తప్పుడు వార్తలు రాస్తున్నారని అలాంటి వార్త ఎవరు నమ్మవద్దని అన్నారు.
నల్గొండ జిల్లా, ఖమ్మం జిల్లా వరంగల్ జిల్లాలో మా కుటుంబానికి, కాంగ్రెస్ పార్టీలో చేసిన అభివృద్ధికి సేవలకు, గుర్తింపుగానే తనకు టికెట్ కేటాయించినట్లు తెలిపారు.
స్వర్గీయ దామోదర్ రెడ్డి, రామ్ రెడ్డి వెంకట్ రెడ్డి మంత్రులుగా కాంగ్రెస్ పార్టీకి ప్రజలకు ఎనలేని సేవలు చేసినట్లు తెలిపారు.
ప్రతి గ్రామంలో హెల్ప్ లైన్ సెంటర్లు ఏర్పాటు చేసి పట్టభద్రుల ఓట్లని నమోదు చేస్తామని అన్నారు.
పట్టభద్రుల గొంతుగా మారి వారి వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికితీసుకొస్తానని అన్నారు. మా కుటుంబం నాలుగు తరాల నుండి కాంగ్రెస్ పార్టీకి విధేయత ఉంటుందని తెలిపారు. మా తండ్రిగారు దామోదర్ రెడ్డి తొలి తెలంగాణ ఉద్యమంలోనే పనిచేసే జైలుకు వెళ్లిన చరిత్ర ఉందని అన్నారు.
శ్రీరాంసాగర్ నీటిని తెచ్చిన చరిత్ర దామోదర్ రెడ్డికి దక్కిందని కాంగ్రెస్ పార్టీకి దక్కిందని అన్నారు. రాజకీయ వారసత్వం తో పాటు విదేశాలలో చదువుకొని అనుభవం ఉందని అన్నారు. మూడు జిల్లాల పట్టభద్రుల ఆశీస్సులతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గుడిపాటి నరసయ్య, జిల్లా మహిళా అధ్యక్షురాలు అనురాధ కిషన్ రావు, సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ నివేదిత లక్షాధి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ ఊర రామ్మూర్తి, పోతు భాస్కర్, రాజేశ్వరరావు, దరూరి యోగనంద చార్యులు, అనీ రెడ్డి రాజేందర్ రెడ్డి, నరసింగ శ్రీనివాస్ గౌడ్, మొరపక సత్యం, మార్కెట్ డైరెక్టర్ బైరబోయిన సైదులు, బైరబోయిన మహారాజు, స్థానిక సర్పంచ్ చిల్లంచర్ల విద్యాసాగర్, జాజిరెడ్డిగూడెం సర్పంచ్ బింగి కృష్ణమూర్తి, పాల్గొన్నారు.
అర్చకులు సాంప్రదాయబద్ధంగా వేదమంత్రాలతో స్వాగతం పలికి ఆశీర్వదించారు.









