Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఆంధ్రప్రదేశ్క్రీడలు

టైక్వాండో పోటీలో బంగారు పతకాలు సాధించిన విద్యార్థులను అభినందించిన శ్రీరామ్ చిన్నబాబు..!

అన్నమయ్య జిల్లా తిరుపతిలో సెప్టెంబర్ 30న జరిగిన జిల్లా తైక్వాండో పోటీల్లో 9 బంగారు పతకాలతో పాటు మొత్తం 18 పతకాలు సాధించిన మదనపల్లె జేపీ తైక్వాండో అకాడమీ విద్యార్థులను తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు శుక్రవారం తన నివాసంలో అభినందించారు.

టైక్వాండో పోటీలో బంగారు పతకాలు సాధించిన విద్యార్థులను అభినందించిన శ్రీరామ్ చిన్నబాబు..!

మదనపల్లె,  మనసాక్షి:

అన్నమయ్య జిల్లా తిరుపతిలో సెప్టెంబర్ 30న జరిగిన జిల్లా తైక్వాండో పోటీల్లో 9 బంగారు పతకాలతో పాటు మొత్తం 18 పతకాలు సాధించిన మదనపల్లె జేపీ తైక్వాండో అకాడమీ విద్యార్థులను తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు శుక్రవారం తన నివాసంలో అభినందించారు.

ఆర్.హర్ష, ఎస్.మధుసాయి, ఎం.హిత్విక్, కే.కావ్య తదితరులు బంగారు పతకాలు, మరో 9 మంది సిల్వర్, బ్రాంజ్ పతకాలు సాధించారు. కోచ్ పి.విఘ్నేష్ ను అభినందించిన చినబాబు అక్టోబర్ 12,13న అనంతపురంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో కూడా రాణించాలని ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు