Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణమహబూబ్‌నగర్

తహసీల్దార్ కార్యాలయం ఆవరణంలో రైతు ఆత్మహత్య

కోయిలకొండ మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో రైతు ఆత్మహత్య చేసుకోవడం జిల్లాలో కలకలం రేపింది. మృతుడుకోయిలకొండ మండలం పార్ పల్లి గ్రామానికి చెందిన రైతు లవప్ప (53).

తహసీల్దార్ కార్యాలయం ఆవరణంలో రైతు ఆత్మహత్య

మహబూబ్ నగర్ జిల్లా, మన సాక్షి

కోయిలకొండ మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో రైతు ఆత్మహత్య చేసుకోవడం జిల్లాలో కలకలం రేపింది. మృతుడుకోయిలకొండ మండలం పార్ పల్లి గ్రామానికి చెందిన రైతు లవప్ప (53). స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, లవప్పకు ఉన్న భూమి పక్కనే మరో ఎకరం భూమి తనదేనని అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయంలో పక్క పొలం రైతులతో గొడవలు జరగడంతో ఇరువురూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు చేసుకున్నారు. మధ్యవర్తి కూడా లవప్పపై కేసు పెట్టాడు.

సమస్య పరిష్కారం కాకపోవడం, గ్రామంలో గొడవలు జరగడంతో మనస్తాపానికి గురైన లవప్ప, శనివారం తెల్లవారుజామున తహసీల్దార్ కార్యాలయ ప్రహరీ గోడ దూకి ఆవరణలోని చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

భూ వివాదంతోనే ఆత్మహత్య – తహసీల్దార్ దీపక్ రావు వివరణ.

ఈ ఘటనపై తహసీల్దార్ దీపక్ రావు స్పందిస్తూ, లవప్ప ఆత్మహత్యకు కుటుంబ సభ్యుల మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న భూ వివాదమే కారణమని తెలిపారు.లవప్ప కుమారుడి వాంగ్మూలం, సూసైడ్ నోట్ లో పేర్కొన్న అంశాల ఆధారంగా విచారణ కొనసాగుతున్నదని వివరించారు.

సర్వే నంబర్ 211 కు సంబంధించిన రెవెన్యూ రికార్డులను పరిశీలించగా 1954-55 ఖాస్రా పహాణీలో 18.39 ఎకరాల పట్టా భూమి నమోదై ఉందని, క్షేత్రస్థాయి పరిశీలనలో 17.39 ఎకరాలు ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. అయితే ఆ భూమితో లవప్పకు ఎలాంటి సంబంధం లేదని తహసీల్దార్ స్పష్టం చేశారు. పోస్టుమార్టం నివేదిక, రెవెన్యూ రికార్డులు, ఇతర ఆధారాల ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని, ఎస్సై నాగరాజు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు