Job Mela : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 65 కంపెనీలతో మెగా జాబ్ మేళా..!

నిరుద్యోగులకు అధికారులు శుభవార్త తెలియజేశారు. నెల 28 న నిర్వహించనున్న జాబ్ మేళా ను నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని నేలకొండపల్లి ఎంపీడీఓ యం.యర్రయ్య సూచించారు.

Job Mela : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 65 కంపెనీలతో మెగా జాబ్ మేళా..!

నేలకొండపల్లి, మన సాక్షి:

నిరుద్యోగులకు అధికారులు శుభవార్త తెలియజేశారు. నెల 28 న నిర్వహించనున్న జాబ్ మేళా ను నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని నేలకొండపల్లి ఎంపీడీఓ యం.యర్రయ్య సూచించారు. మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం తన చాంబర్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు… జిల్లా యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 28 న కూసుమంచి మండలం లోని పాలేరు బీపీరెడ్డి పంక్షన్ హాలు లో ఏర్పాటు చేసిన జాబ్ మేళా ను వినియోగించుకోవాలని సూచించారు.

పార్మా, ఐటీ జాబ్స్, మార్కెటింగ్, హెచ్ఎర్. ఎక్జిక్యూట్, కాల్ సెంటర్, డాటా ఏంట్రీ, అడ్మినిస్ట్రేషన్, రియల్ ఎస్టేట్స్ రిటైల్, హౌజ్ కీపింగ్ స్టోర్ మేనేజర్, డెలివరీ బాయ్స్, హెల్డర్. ఫిట్టర్, డ్రైవర్స్ తదితర ఉద్యోగాలు విద్యార్హత ను బట్టి యువతీ, యువకులకు ప్రాధాన్యత ఉంటుందని -అన్నారు.

ప్రాముఖ్యత కలిగిన 65 కంపెనీలు ఈ జాబ్ మేళా లో దాదాపు 5 వేల కు పెగా ఉద్యోగ అవకాశాలు ఇవ్వనున్నటు పేర్కొ న్నారు. ఇందు కోరకు ఎటువంటి రుసుం లేకుండా జాబ్ మేళా లో పాల్గొనాలని సూచించారు. అర్హత కలిగిన వారు హెల్ప్ లైన్ డెస్క్ కు ఫోన్ ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు. నిరుద్యోగ యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ విలేకర్ల సమావేశంలో మండల పంచాయతీ అధికారి సిహెచ్ శివ ఉన్నారు.

ALSO READ : 

Mahalakshmi: ప్రతి మహిళకు నెలకు ₹2500 ఎప్పటినుంచంటే.. మీరు అర్హులేనా..?

POSTAL: పోస్టల్ శాఖలో 50వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్, రాత పరీక్ష లేకుండా ఎంపిక..!