Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

BREAKING: తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్.. ధరణి ఫైళ్ల తనిఖీ..! 

BREAKING: తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్.. ధరణి ఫైళ్ల తనిఖీ..! 

దేవరకొండ, మనసాక్షి :

ప్రజావాణి, ధరణి ఫైళ్ల తనిఖీ ధరణి, ప్రజావాణి ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశం ప్రజావాణి , ధరణి ద్వారా స్వీకరించిన ఫిర్యాదులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. దీనివల్ల నిజమైన లబ్ధిదారులకు జాప్యం లేకుండా వారి సమస్యలకు పరిష్కరం దొరుకుతుందని అన్నారు.

శుక్రవారం అయన చందంపేట తహసిల్దార్ కార్యాలయాన్ని అలాగే ఎంపీడీవో కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గత సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఎన్ని ఫిర్యాదులు స్వీకరించారని అడగగా తహసిల్దార్ కార్యాలయంలో 266 ఫిర్యాదులు స్వీకరించడం జరిగిందని తహసిల్దార్ శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ కు వివరించారు.

ఇందుకు జిల్లా కలెక్టర్ స్పందిస్తూ ప్రజావాణి ఫిర్యాదులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ముఖ్యంగా తహసిల్దార్ స్థాయిలో ఉండే ఫిర్యాదులను అప్పుడే పరిష్కరించాలని, ఆర్డీవో స్థాయిలో పరిష్కరించేవి ఆర్డీవో పరిష్కరించాలని, ఒకవేళ జిల్లా స్థాయికి పంపించాల్సి ఉంటే జాప్యం లేకుండా పంపించాల్సిందిగా ఆదేశించారు. మనసు పెట్టి పని చేస్తే నిజమైన ఫిర్యాదుదారులకు వెంటనే పరిష్కారం దొరుకుతుందని అన్నారు.

ఈ సందర్భంగా ఆయన సిబ్బందితో మాట్లాడుతూ అందరూ బాగా పనిచేయాలని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణి పిటిషన్లు, ఆయా కేటగిరి వారిగా వచ్చిన ఫిర్యాదులను అడిగి తెలుసుకున్నారు. పరిష్కారం చేయగలిగినవి తక్షణమే చేయాలని, పెండింగ్లో లేకుండా చూడాలని, ఒకవేళ పరిష్కారం కానీ ఫిర్యాదులను ఫిర్యాదుదారుకు స్పష్టంగా తెలియజేయాల్సిందిగా ఆయన ఎంపీడీవో లక్ష్మీని ఆదేశించారు. దేవరకొండ ఆర్డిఓ శ్రీరాములు, తహసిల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో లక్ష్మి, ఎంపీపీ పార్వతి ఉన్నారు

ALSO READ: 

BREAKING : జిల్లా కలెక్టర్ ఉత్తర్వులపై మండిపడ్డ వైద్యులు, సిబ్బంది నిరసన.. సందర్శించిన అదనపు కలెక్టర్..!

Job Mela : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 65 కంపెనీలతో మెగా జాబ్ మేళా..!

Cm Revanth Reddy: నన్ను తప్పించండి.. సోనియా, రాహుల్ గాంధీలకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి..!

 

మరిన్ని వార్తలు