BREAKING : జిల్లా కలెక్టర్ ఉత్తర్వులపై మండిపడ్డ వైద్యులు, సిబ్బంది నిరసన.. సందర్శించిన అదనపు కలెక్టర్..!

జిల్లా కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులను తక్షణమే వెనక్కి తీసుకోవాలని, ఆసుపత్రిలో ఇతర డిపార్ట్మెంట్ల అధికారుల జోక్యం తమపై వద్దని గురువారం జిల్లా ఆస్పత్రి వద్ద డాక్టర్లు, అన్ని విభాగాల అధిపతులు, సిబ్బంది నర్సులు నిరసన వ్యక్తం చేశారు.

BREAKING : జిల్లా కలెక్టర్ ఉత్తర్వులపై మండిపడ్డ వైద్యులు, సిబ్బంది నిరసన.. సందర్శించిన అదనపు కలెక్టర్..!

నల్లగొండ, మనసాక్షి :

నల్గొండ జిల్లా ప్రధాన ఆస్పత్రిని తనిఖీ చేసేందుకు జిల్లా అధికారులకు అధికారం లేదని, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ లేదా జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారి మాత్రమే తనిఖీ చేయాలని, జిల్లా ఆస్పత్రిని జిల్లా అధికారులు తనిఖీ చేసే విధంగా జిల్లా కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులను తక్షణమే వెనక్కి తీసుకోవాలని, ఆసుపత్రిలో ఇతర డిపార్ట్మెంట్ల అధికారుల జోక్యం తమపై వద్దని గురువారం జిల్లా ఆస్పత్రి వద్ద డాక్టర్లు, అన్ని విభాగాల అధిపతులు, సిబ్బంది నర్సులు నిరసన వ్యక్తం చేశారు.

ఈ విషయంపై జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి తక్షణమే స్పందించి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి. పూర్ణచంద్రను ఈ విషయంపై తక్షణమే ఆసుపత్రిని సందర్శించి పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గురువారం జిల్లా ప్రధాన ఆసుపత్రిని సందర్శించడం జరిగింది.

ఈ సందర్భంగా ఆయన నిరసన వ్యక్తం చేస్తున్న డాక్టర్లు, ప్రొఫెసర్లు విభాగాల అధిపతులతో మాట్లాడుతూ ప్రధానాస్పత్రిలో శానిటేషన్ , టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్ వంటి మౌలిక సదుపాయాల కల్పన సేవల పై మాత్రమే జిల్లా అధికారులు పరిశీలన చేసి సమాచారం ఇచ్చేందుకు జిల్లా యంత్రాంగం ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని, అంతేకానీ డాక్టర్లు, ప్రొఫెసర్ల పనితీరు వారి వృత్తి పై కాదని ,అలాగే వారి పై ఎలాంటి నియంత్రణ అధికారాలు ఇవ్వలేదని స్పష్టం చేశారు.

ALSO READJob Mela : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 65 కంపెనీలతో మెగా జాబ్ మేళా..!

 

ఓపి ,స్పెషాలిటీ వార్డులకు సంబంధించి డాక్టర్ల హాజరు రిజిస్టర్ల పరిశీలన మాత్రమే చేయమని ఉత్తర్వులలో పేర్కొనడం జరిగిందని , డాక్టర్లకు సంబంధించి వారి వృత్తికి సంబంధించి వారిపై ఎలాంటి ప్రశ్నలు అడగడం, లేదా ఇతర నియంత్రణకు ఎవరికి అధికారం ఇవ్వలేదని స్పష్టం చేశారు.

జిల్లా అధికారులు ఆసుపత్రిని సందర్శించిన సమయంలో వైద్యుల హాజరు పట్టికను మాత్రమే చూస్తారని, ముఖ్యంగా పరిపాలనలో అంతర్భాగమైన అన్ని విభాగాలలో, వార్డులలో పారిశుద్ధ్యం సరిగా ఉన్నది లేనిది అన్నిటిని పరిశీలించి నివేదిక ఇస్తారని తెలిపారు.

అలాగే రేడియాలజీకి సంబంధించి ఎక్స్ రే, ఆల్ట్రా సౌండ్ స్కానింగ్, సిటి స్కానింగ్, ఈసీజీ యూనిట్ లను పరిశీలించి ఆరోజు అప్పటివరకు ఎంతమందికి సేవలు అందించడం జరిగింది, అక్కడ ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా అని పరిశీలించి కలెక్టర్ కు నివేదిస్తారని పేర్కొన్నారు.

డయాగ్నస్టిక్ సంబంధించి ఆరోజుజిల్లా అధికారి జిల్లా ఆస్పత్రిని సందేశించే సమయానికి ఎన్ని టెస్టులు చేయాలి ,ఆ సమయానికి ఎన్ని జరిగాయో పరిశీలిస్తారే తప్ప, ఎవరిని ప్రశ్నించడం జరగదని పేర్కొన్నారు. ముందు వచ్చిన వారికి ముందు సేవలు అందిస్తున్నది లేనిది పరిశీలిస్తారని తెలిపారు.

అలాగే రోగుల భోజనం సంబంధించి వంటగది శుభ్రంగా ఉందా లేదా? భోజనశాల శుభ్రంగా ఉన్నది లేనిది పరిశీలిస్తారని, భోజనానికి వాడుతున్న కిరాణా సామాగ్రి, కూరగాయలు, పప్పు దినుసులు వంటివి తాజాగా ఉన్నది లేనిది, నిలువ ఉన్నవాటిని వాడుతున్నది లేనిది తనిఖీ సందర్భంగా జిల్లా అధికారులు పరిశీలించి తెలియజేయడం జరుగుతుందని తెలిపారు.

ALSO READ : Whatsspp : వాట్సాప్ లో అదిరిపోయే మెటా ఏఐ ఫీచర్.. తెలియని విషయాలు సెకండ్లలో తెలుసుకోవచ్చు..!

అలాగే ముఖ్యమైన వార్డులలో పారిశుద్ధ్యం సరిగా ఉన్నది లేనిది, రోగులకు సంతృప్తికరంగా ఉన్నది లేనిది ,ఏవైనా లోటుపాట్లు ఉన్నట్లయితే పరిశీలించి జిల్లా కలెక్టర్ కి తెలియజేస్తారని పేర్కొన్నారు. ఓపిలో ఆరోజు అప్పటివరకు ఎంతమంది వచ్చారు. డాక్టర్లు వారిని చూసి పంపడానికి ఎంత సమయం తీసుకుంటున్నది, అవసరమైన రోగులకు వీల్ చైర్లు, స్ట్రేచర్ వంటివి ఏర్పాటు చేసేందుకు సిబ్బంది సహాయకుల పనితీరును మాత్రమే పరిశీలించడం జరుగుతుందని ఆయన వెల్లడించారు.

ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి ద్వారా ప్రజలకు మంచి సేవలు అందించాలన్నదే జిల్లా యంత్రాంగం తపన అని ,అందుకుగాను సౌకర్యాల కల్పన ,మెరుగైన వైద్య సేవలు అందించేందుకు జిల్లా అధికారులను పరిశీలనకు నియమించడం జరిగిందని స్పష్టం చేశారు. జిల్లా అధికారులకు ఇచ్చిన ఉత్తర్వులు సైతం కేవలం వీటన్నిటి పై పరిశీలన చేసి నివేదిక ఇవ్వాలని ప్రొఫార్మా డిజైన్ చేసి చెక్ లిస్ట్ ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు.

ALSO READBREAKING : ముందస్తు సెలవు లేకుండా పాఠశాలకు గైర్హాజరైతే సస్పెండ్.. ఉపాధ్యాయులకు జిల్లా కలెక్టర్ వార్నింగ్..!

డాక్టర్ల గదులు వారి సేవలపై ఎలాంటి తనిఖీ ఉండదని ఆయన స్పష్టం చేశారు హాజరు విషయం తప్ప డాక్టర్స్ పై తనిఖీకి ఉత్తర్వులలో ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని స్థానిక సంస్థల ఆదనపు కలెక్టర్ వెల్లడించారు.

హాస్పిటల్లో అందరికీ ఉపయోగపడేలా జిల్లా యంత్రాంగానికి అవసరమన్న ఉద్దేశంతోనే జిల్లా అధికారుల సహాయాన్ని తీసుకోవడం జరిగిందని, డాక్టర్లకు సంబంధించి వారి పనితీరు మరియు వారి వృత్తిపరమైన విషయాలలో జోక్యానికి సంబంధించి ఎలాంటి అజమాయిషి చేయడం లేదని వెల్లడించారు. ఈ విషయాలన్నీ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఆసుపత్రి డాక్టర్లు, పర్యవేక్షకులు, డిసిహెచ్ఎస్ అందరి సమక్షంలోని తెలియజేయడం జరిగింది.

ఈనెల 21న జిల్లా కలెక్టర్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఆసుపత్రి సూపరింటెండెంట్ ,మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ ,డిఎం అండ్ హెచ్ ఓ మరియు డి సి హెచ్ ఎస్, డాక్టర్లు, ప్రొఫెసర్లు, వివిధ విభాగాల అధిపతులతో ప్రభుత్వ ప్రధానాస్పత్రి పై నిర్వహించిన సమీక్ష సందర్భంగా జిల్లా ఆస్పత్రిలో సౌకర్యాల కల్పనతో పాటు, మెరుగైన వైద్య సేవలు అందించేందుకు గాను

ప్రతిరోజు ఒక జిల్లా స్థాయి అధికారిని పర్యవేక్షణ కు నియమిస్తే ప్రజలకు మంచి సేవలు అందించవచ్చు అని నిర్ణయించడం జరిగిందని , ఆరోజు ఈ విషయంపై డాక్టర్లు కానీ, ప్రొఫెసర్లు కానీ, అదేవిధంగా విభాగాల అధిపతులు సైతం ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తెలిపారు.

ALSO READ 

BIG BREAKING: తెలంగాణ మంత్రివర్గంలో ఆ నలుగురికి చోటు..?

WhatsApp : ఆ 35 ఫోన్లకు వాట్సప్ సేవలు బంద్.. జాబితాలో మీ ఫోన్ ఉందా.. చూసుకోండి..!