Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESతెలంగాణరాజకీయం

BIG BREAKING: తెలంగాణ మంత్రివర్గంలో ఆ నలుగురికి చోటు..?

BIG BREAKING: తెలంగాణ మంత్రివర్గంలో ఆ నలుగురికి చోటు..?

మన సాక్షి తెలంగాణ బ్యూరో :

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి మంత్రివర్గ విస్తరణ అంశాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లేందుకు వెళ్లినట్లు తెలుస్తుంది. ఎవరెవరికి మంత్రి పదవులు ఇవ్వాలనే అంశంపై పార్టీ పెద్దలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు చర్చలు జరిపినట్లు సమాచారం.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నలుగురి పేర్లతో జాబితాను అధిష్టానానికి అందించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రెండు పేర్లతో మరో జాబితాను అందించినట్లు సమాచారం. దీంతో ఆరుగురు పేర్లలో నలుగురికి మంత్రి పదవులు ఫైనల్ చేసే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి కాగా ప్రస్తుతం నాలుగు మంత్రి పదవులకు భారతి చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.

ఆ నలుగురిలో నిజామాబాద్ జిల్లా నుంచి సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, గిరిజన సామాజిక వర్గం నుంచి నల్లగొండ జిల్లా దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ తో పాటు ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వాకిటి శ్రీహరి, మైనార్టీ హోటల్ షబ్బీర్ అలీ పేర్లు పరిశీలిస్తున్నట్లు సమాచారం.

భువనగిరి పార్లమెంటు స్థానాన్ని గెలిపించిన తన సోదరుడు రాజగోపాల్ రెడ్డి పేరును మంత్రివర్గ విస్తరణలో పరిశీలించాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి హై కమాండ్ ను కోరినట్లు సమాచారం. కాగా ఇద్దరు సోదరులకు మంత్రి పదవులు వస్తాయా..? రావా.? అనేది చర్చనీ అంశమైంది.

నలుగురి పేర్లు మాత్రం ఫైనల్ అయినట్లు తెలుస్తుంది. క్యాబినెట్ విస్తరణ శ్రావణమాసంలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ALSO READ 

BREAKING : ముందస్తు సెలవు లేకుండా పాఠశాలకు గైర్హాజరైతే సస్పెండ్.. ఉపాధ్యాయులకు జిల్లా కలెక్టర్ వార్నింగ్..!

Mahalakshmi: ప్రతి మహిళకు నెలకు ₹2500 ఎప్పటినుంచంటే.. మీరు అర్హులేనా..?

మరిన్ని వార్తలు