సాగర్ లో గుప్త నిధుల త్రవ్వకాల కలకలం.. పోలీసుల అదుపులో ఇద్దరు వ్యక్తులు
సాగర్ లో గుప్త నిధుల త్రవ్వకాల కలకలం.. పోలీసుల అదుపులో ఇద్దరు వ్యక్తులు
నాగార్జునసాగర్, మన సాక్షి :
నల్గొండ జిల్లా నందికొండ మున్సిపాలిటీ నాగార్జునసాగర్ పైలాన్ కాలనీలో ఒక ఇంట్లో గుప్త నిధులు కోసం గత కొన్ని రోజులుగా త్రవ్వకాలు నిర్వహిస్తున్న వారిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నట్లుగా సాగర్ ఎస్సై సంపత్ గౌడ్ తెలిపారు.
స్థానికులు పోలీసులు వివరాలు ప్రకారం పైలాన్ కాలనీలోని కోడే మల్లి తన ముగ్గురు సోదరులతో కలిసి తన నివాసంలో గత కొన్ని రోజులుగా గుప్తనిధుల కోసం త్రవ్వకాలు నిర్వహిస్తున్నారు.. దీనికై హైదరాబాద్ నుండి గుప్తనిధులు కోసం పూజలు నిర్వహించే వారిని సైతం తీసుకువచ్చి ఇటువంటి చర్యలు పూనుకోవడం స్థానికులను ఆందోళన కలిగిస్తుంది.
స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఆ ఇంటి కుటుంబ సభ్యులను, పూజలు చెయ్యడానికి వచ్చిన మరో ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వీరితోపాటు మరికొంతమంది ప్రమేయం ఉందనే విషయంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలిపారు. ఈ విషయంలో కేసు నమోదు చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు.









