Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

నల్లగొండలో ఎండిన చెరువులు.. ఖమ్మంకు సాగర్ నీళ్లు తరలింపు..!

నల్లగొండలో ఎండిన చెరువులు.. ఖమ్మంకు సాగర్ నీళ్లు తరలింపు..!

మిర్యాలగూడ , మన సాక్షి :

నల్గొండ జిల్లాలో చెరువులు నింపకుండానే నాగార్జునసాగర్ ఎడమ కాలువ నీటిని ఖమ్మం జిల్లాకు తరలిస్తున్నారు. రోజుకు 1000 క్యూసెక్కుల చొప్పున సాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేశారు. నల్గొండ జిల్లాలో చెరువులు ఖాళీగా ఉన్నప్పటికీ వాటిని నింపకుండా ఖమ్మం జిల్లాలోని పాలేరు రిజర్వాయర్ కు వీటిని తరలిస్తున్నారు. దాంతో మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు ఒక ప్రకటనలో తీవ్రంగా విమర్శించారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇద్దరు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డి ఉన్నప్పటికీ ఖమ్మం జిల్లాకు నీటిని తరలిస్తుంటే నిమ్మకు నీరు ఎత్తకుండా ఉన్నారని ఆయన విమర్శించారు.

సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నా.. కృష్ణా నదిలో పుష్కలంగా నీళ్లు ఉన్నప్పటికీ శ్రీశైలం కు లక్ష యాభై వేల క్యూసెక్కుల నీళ్లు వస్తున్నప్పటికీ కూడా నల్గొండ జిల్లాలో ఎండిపోయిన చెరువులను నింపడం లేదన్నారు. ప్రస్తుతం వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నప్పటికీ ఖమ్మం జిల్లాకు ఎడమ కాలువ నీళ్లు ఎందుకు తీసుకెళ్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొన్నదని ఆయన పేర్కొన్నారు.

నల్గొండ జిల్లా రైతాంగానికి నీటిని విడుదల చేస్తే ఇటీవల కురుస్తున్న వర్షాల వల్ల రైతులకు కూడా మేలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటికే మూడు పర్యాయాలు తాగునీటి అవసరాల పేరుతో ఖమ్మం జిల్లాకు సాగర్ ఎడమ కాలువ నీటిని తరలించారని ఆయన విమర్శించారు. నల్గొండ జిల్లాలో తాగు, నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని నీటిని విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ALSO READ : 

Good News : రైతులకు గుడ్ న్యూస్.. వారికి పంట రుణాలు..!

Srishailam : శ్రీశైలంకు భారీ వరద.. 27 గేట్ల ద్వారా జూరాల నుంచి దిగువకు నీటి విడుదల.. లేటెస్ట్ అప్డేట్..!

Godavari Flood Warning : గోదావరి ఉగ్రరూపం.. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ, నిలిచిన రాకపోకలు..!

మరిన్ని వార్తలు