Breaking Newsతెలంగాణనల్గొండవ్యవసాయం

District collector : మార్క్ ఫెడ్ ఎరువుల గోదామును ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్.. ఎరువుల యాప్ పై ఆరా..!

యూరియా సరఫరా పంటల సాగు లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం అయన నల్గొండ జిల్లా, మిర్యాలగూడ సమీపంలో ఉన్న తుంగపహాడ్ మార్క్ఫెడ్ వేర్ హౌసింగ్ గోదామును ఆకస్మికంగా తనిఖీ చేశారు.

District collector : మార్క్ ఫెడ్ ఎరువుల గోదామును ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్.. ఎరువుల యాప్ పై ఆరా..!

మిర్యాలగూడ, మన సాక్షి:

యూరియా సరఫరా పంటల సాగు లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం అయన నల్గొండ జిల్లా, మిర్యాలగూడ సమీపంలో ఉన్న తుంగపహాడ్ మార్క్ఫెడ్ వేర్ హౌసింగ్ గోదామును ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ యూరియా నిల్వలు, సరఫరా, రవాణా, లారీల ఏర్పాటు, సమస్యలను మార్క్ ఫెడ్ అధికారుల ద్వారా అడిగి తెలుసుకున్నారు.

అనంతరం శ్రీనివాస్ నగర్ లో ఉన్న ఎరువుల దుకాణంలో ఆన్ లైన్ ద్వారా నిర్వహిస్తున్న ఎరువుల సరఫరా ప్రక్రియను పరిశీలించారు. ఎరువుల విక్రయాలు ఆన్లైన్లో ఏ విధంగా చేస్తున్నారో డీలర్, రైతుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు జిల్లా కలెక్టర్ తో మాట్లాడుతూ ఏ మండలంలోని రైతులకు ఆ మండలంలోనే ఎరువులు సరఫరా చేయాలని, ఆన్లైన్లో స్టాక్ చూపించిన 10, 20 నిమిషాల్లోనే యూరియా స్టాక్ అయిపోతున్నదని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని కలెక్టర్ తెలిపారు.

అంతకుముందు జిల్లా కలెక్టర్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్ తో రబీ వ్యవసాయ ప్రణాళిక పై సమీక్షించారు. కాగా ఈ రబికి సంబంధించి జిల్లాలో 6,57,000 ఎకరాలు సాగు విస్తీర్ణం కానుందని, ప్రత్యేకించి రబీలో 74,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, ఇప్పటివరకు 35,000 మెట్రిక్ టన్నులు విక్రయించడం జరిగిందని , గోదాంలో 10000 మెట్రిక్ టన్నులు నిల్వ ఉండగా, డీలర్ల వద్ద మరో 3000 మెట్రిక్ టన్నుల యూరియా ఉందని తెలిపారు.

ఎరువులకు సంబంధించి జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద అమలు చేస్తున్న ఎరువుల ఆప్ పై కలెక్టర్ ఆరా తీశారు. మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్,జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్, మార్క్ ఫెడ్ అధికారి వీరస్వామి, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు సైదా నాయక్ తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.

MOST READ : 

  1. Miryalaguda : ప్రజాదరణ పొందిన మనసాక్షి.. నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ..!

  2. Hyderabad : డయల్–100కు క్షణాల్లో స్పందించిన పోలీసులు.. ఏటీఎం దొంగ అరెస్ట్..!

  3. Rythu Bharosa : తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వారికి రైతు భరోసా కట్..!

  4. Good News : రైతులకు భారీ గుడ్ న్యూస్.. వారి ఖాతాలలో డబ్బులు జమ అప్పుడే..!

  5. TG News : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. శాసనసభలో సీ ఎం రేవంత్ రెడ్డి స్పష్టం..!

మరిన్ని వార్తలు