District collector : రైతులతో కలిసి జిల్లా కలెక్టర్ రైతు నేస్తం లో ముఖాముఖి..!
District collector : రైతులతో కలిసి జిల్లా కలెక్టర్ రైతు నేస్తం లో ముఖాముఖి..!
చింతపల్లి, మన సాక్షి :
దేశానికి అన్నం పెట్టే రైతు కు అండదండగా ఉండేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయకులు అన్నారు. ప్రభుత్వం రైతుల కోసం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో గ్రామాలలో చేపడుతున్న “రైతునేస్తం – రైతులతో ముఖాముఖి” టెలి కాన్ఫరెన్స్ కార్యక్రమం సోమవారం చింతపల్లి మండల పరిధిలోని నెలవలపల్లి గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దేవరకొండ శాసన సభ్యులు నేనావత్ బాలు నాయక్ , జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పాల్గొని రైతులతో నేరుగా సంభాషించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలను వివరించారు. ముఖ్యంగా సాగునీటి వనరుల అభివృద్ధి, ఎరువుల, విత్తనాల సరఫరా, మార్కెట్ సదుపాయాలు, రుణ మాఫీపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు.
అనంతరం రైతుల నుంచి ప్రత్యక్షంగా సమస్యలను విని, వాటి పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే బాలు నాయక్ రైతులకు హామీ ఇచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సంకల్పంతో రాష్ట్రంలో వ్యవసాయం లాభసాటిగా మారేందుకు చేపడుతున్న చర్యలను రైతులు ప్రశంసించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం, రైతుల మధ్య నేరుగా సమీక్షా వేదిక ఏర్పడడం పట్ల స్థానికులు సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారులు, ఏ డి శ్రీలక్ష్మి ఆర్టీఓ రమణారెడ్డి, మాల్ మార్కెట్ కమిటీ చైర్మన్ దొంతం అలివేలు సంజీవరెడ్డి, మండల వ్యవసాయ శాఖ అధికారి ఏఓ శ్రవణ్ కుమారి , పిఎసిఎస్ చైర్మన్ లింగంపల్లి వెంకటయ్య , స్థానికమాజీ ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, రైతులు, గ్రామ ప్రజలు పలు గ్రామాల మాజీ సర్పంచ్లు ఎంపిటిసిలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
MOST READ :
-
CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన.. ఆసుపత్రుల పర్యవేక్షణకు త్వరలో యాప్..!
-
ACCIDENT : ద్విచక్ర వాహనాలు ఢీకొని వ్యక్తి మృతి..!
-
Miryalaguda : ఆహారపు అలవాట్లు మార్చుకోండి.. ఆయుః ప్రమాణం పెంచుకోండి..!
-
TPCC : మంత్రి పొంగులేటి పై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సీరియస్..!
-
Rythu Bharosa : రైతుల ఖాతాలలో రైతు భరోసా డబ్బులు.. డేట్ ఫిక్స్.. ఆ రోజు పండుగే.. బిగ్ అప్డేట్..!









