Miryalaguda : ఆహారపు అలవాట్లు మార్చుకోండి.. ఆయుః ప్రమాణం పెంచుకోండి..!
Miryalaguda : ఆహారపు అలవాట్లు మార్చుకోండి.. ఆయుః ప్రమాణం పెంచుకోండి..!
ప్రముఖ నరాల వైద్యులు గోపాలం శివన్నారాయణ
మిర్యాలగూడ, మన సాక్షి :
మారుతున్న కాలానికి అనుగుణంగా ఆహారపు అలవాట్లలో మార్చుకొని, ప్రతీ రోజు ఒక గంట వ్యాయామం, శరీరక శ్రమ చేయడం, చిన్న చిన్న పనులకు బైక్ లు వాడకుండా నడక మార్గాన వెళ్లాలని, ఆహారాన్ని మితంగా తీసుకోవాలని, వైద్యుని సలహా మేరకు మందులను వాడాలని తద్వారా జీవన ప్రమాణాన్ని పెంచుకోవచ్చని ప్రముఖ నరాల వైద్యులు గోపాలం శివన్నారాయణ అన్నారు.
ఆదివారం మిర్యాలగూడ హోసింగ్ బోర్డు కాలనీ లోని నవ జ్యోతి ఇంగ్లిష్ మీడియం పాఠశాల లో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిభిరం లో పాల్గొని పక్షవాతం, పిట్స్, బీపి, షుగర్ రోగులకు 260 మందికి పరీక్షించి, దాతలు అభ్యాస్ స్కూల్ అధినేత వంగాల నిరంజన్ రెడ్డి, శాస్త్రావేత్త బంటు భాస్కర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ రెహానా అలీ దాతృత్వంతో 4 నెలలకు సరిపడా మందులను అందజేశారు.
నిర్వాహకులు కోలా శ్రీనివాస్, పాదురి రమణా రెడ్డి మాట్లాడుతూ నిరుపేద రోగుల కొరకు నిర్వహించబడుతున్న ఇట్టి ఆరోగ్య శిభిరాన్ని సధ్వినియోగం చేసుకోవాలని, ఇటువంటి శిభిరానికి దాతలు చేయుత నివ్వాలని కోరారు.
ఈ కార్యక్రమం లో డాక్టర్ కోమలి, రిటైర్డ్ ఎస్ బి ఐ డి జి ఎం సైదిరెడ్డి, జన విజ్ఞాన వేదిక నల్లగొండ జిల్లా అధ్యక్షులు గుత్తికొండ సుదర్శన్ రెడ్డి, పారెపల్లి సత్యనారాయణ రావు, శోభారాణి, సురేష్ కుమార్, మోర్తల శ్రీనివాస్ రెడ్డి, నక్క శ్రీనివాస్, వెంకట రమణా రెడ్డి, సత్యనారాయణ, మట్టారెడ్డి, ఫహీమ్ తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
District collector : రైతులకు జిల్లా కలెక్టర్ కీలక సూచన.. రైతు నేస్తం వీక్షించాలి..!
-
Rythu Bharosa : రైతుల ఖాతాలలో రైతు భరోసా డబ్బులు.. డేట్ ఫిక్స్.. ఆ రోజు పండుగే.. బిగ్ అప్డేట్..!
-
District collector : చెన్నై, బెంగళూరుకు అంజీర ఎగుమతి.. సాగు పరిశీలించిన జిల్లా కలెక్టర్.. ఆ రైతుకు సన్మానం..!
-
Rythu Bharosa : రైతు భరోసాకు నిబంధనలు.. మంత్రి తుమ్మల స్పష్టం.. విడుదలకు డేట్ ఫిక్స్..!
-
Rythu Bharosa : రైతు భరోసా కు దరఖాస్తుల స్వీకరణ.. లేటెస్ట్ అప్డేట్..!









