District collector : బాలికలకు HPV వ్యాక్సిన్.. ప్రారంభించిన జిల్లా కలెక్టర్..!
ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో 14నుండి 15 సంవత్సరాల లోపు బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ బి .చంద్రశేఖర్ తెలిపారు.

District collector : బాలికలకు HPV వ్యాక్సిన్.. ప్రారంభించిన జిల్లా కలెక్టర్..!
నల్లగొండ, మన సాక్షి
ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో 14నుండి 15 సంవత్సరాల లోపు బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ బి .చంద్రశేఖర్ తెలిపారు. ఆదివారం ప్రభుత్వ కేంద్ర ఆస్పత్రి లో బాలికలకు హెచ్ పి వి వాక్సికేషన్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా మొదటి దశలో 21 వేల మంది బాలికలను గుర్తించినట్లు తెలిపారు. వారికి తల్లిదండ్రుల సమక్షంలో టీకా వేయించడం జరుగుతుందని పేర్కొన్నారు. హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల భవిష్యత్తులో వచ్చే సర్వైకల్ క్యాన్సర్ (గర్భాశయ ద్వార క్యాన్సర్) నుండి రక్షణ పొందవచ్చని చెప్పారు.
అర్హులైన బాలికల వివరాలను ఆధార్ కార్డు ఆధారంగా నమోదు చేయడం జరుగుతుందని, టీకా తీసుకున్న వారికి సంబంధిత సర్టిఫికెట్లు కూడా అందజేస్తామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమంపై తల్లిదండ్రులు, బాలికలకు అవగాహన కల్పించాలని ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు.
వ్యాక్సిన్ అందరు ఉపయోగించుకోవాలని ప్రభుత్వ ఆసుపత్రిలో పిహెచ్ సెంటర్లో వేయించుకోవాలని ప్రైవేట్ సెంటర్లో వెళ్లినచో డబ్బులు ఖర్చు అవుతుందని ప్రభుత్వ ఆస్పత్రిసెంటర్లో ఫ్రీగా ఇవ్వడం దశల వారుగా వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది అన్నారు. అర్హులైన ప్రతి బాలిక ఈ టీకాను తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు.
మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల బాలికలు ఆరోగ్యం గా ఉంటారు క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు మహిళలు స్ట్రాంగ్ గా ఉంటే సమాజం బాగుంటుంది మహిళలు ముందుజాగ్రత్తగా వ్యాక్సిన్ వేసుకోవడం చాలా మంచిదని చెప్పారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి పుట్ల శ్రీనివాస్ డిప్యూటీ అధికారి వేణుగోపాల్ రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి డిప్యూటీ సూపర్డెంట్ నగేష్ ఆర్ ఎమ్ఓ మహేష్. మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి. కార్పొరేటర్ లు నాగలక్ష్మి, వేణుగోపాల్ రెడ్డి, అల్లి సుభాష్ డాక్టర్ పుల్లారావు డాక్టర్ రమేష్. తదితరులు పాల్గొన్నారు









