District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ..!

District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
ఆరోగ్య కేంద్రం పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా లో గల అర్బన్ హెల్త్ సెంటర్ ( పట్టణ ఆరోగ్య కేంద్రం) ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సెంటర్ లోని అన్ని గదులను పరిశీలించారు.
అవసరమైన మందులు అందుబాటు లో ఉన్నాయా ? లేదా అని వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సెంటర్ కు వచ్చిన పలువురు రోగులతో మాట్లాడి వైద్య సేవలు గురించి ఆరా తీశారు. ఆస్పత్రి పరిసరాలను చూసి పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అలాగే ఆస్పత్రి లోని అన్ని గదుల కిటికీలకు జాలి తెర ఏర్పాటు చేయించాలని ఆదేశించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ హెల్త్ సెంటర్ లో రక్త పరీక్ష చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జయ చంద్రమోహన్, హెల్త్ సెంటర్ వైద్య అధికారి డాక్టర్ నరసింహారావు సగరీ, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
MOST READ :









