District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనుల పరిశీలన..!

District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనుల పరిశీలన..!
కనగల్, మన సాక్షి:
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులను వేగవంతం చేయాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. శనివారం కనగల్ మండలం తేలకంటిగూడెంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులను ఆమె పరిశీలించారు. పనుల్లో వేగం పెంచాలని సూచించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పైలెట్ ప్రాజెక్టు కింద గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను చేపడుతున్నట్లు వివరించారు. ఇప్పటికే మెజారిటీ ఇండ్ల నిర్మాణం పనులు పూర్తయ్యాయని, అసంపూర్తిగా ఉన్న ఇండ్లను సైతం పూర్తి చేయాలని లబ్ధిదారులకు సూచించారు.
నిర్మాణాలు పూర్తయిన వెంటనే రోడ్లు – భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో గృహాల ప్రారంభోత్సవం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ ఆర్డిఓ అశోక్ రెడ్డి, హౌసింగ్ పీడీ రాజ్ కుమార్, తహసిల్దార్ పద్మ, ఎంపీడీవో సుమలత, హౌసింగ్ ఏఈ వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్ బోగరి రాంబాబు, పంచాయతీ కార్యదర్శి క్రాంతి, నాయకులు బిళ్ళపాటి మోహన్ రెడ్డి, రామ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
CM Revanth Reddy : సామాన్యుడిలా సడన్ ఎంట్రీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి.. (వీడియో)
-
Miryalaguda : గణేష్ నిమజ్జనంలో అపశృతి.. సాగర్ ఎడమ కాలువలో తండ్రి, కొడుకులు గల్లంతు..!
-
Best Award : రాష్ట్ర ఉత్తమ అధ్యాపక అవార్డుకు ఎంపికైన వెల్దండి శ్రీధర్.. ఎవరో తెలుసా..!
-
Nalgonda : చిన్నారి ప్రాణం తీసిన ప్రైవేట్ స్కూల్ బస్సు..!









