Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Best Award : రాష్ట్ర ఉత్తమ అధ్యాపక అవార్డుకు ఎంపికైన వెల్దండి శ్రీధర్.. ఎవరో తెలుసా..! 

Best Award : రాష్ట్ర ఉత్తమ అధ్యాపక అవార్డుకు ఎంపికైన వెల్దండి శ్రీధర్.. ఎవరో తెలుసా..! 

నల్లగొండ, మన సాక్షి :

నాగార్జున ప్రభుత్వ కళాశాల తెలుగు శాఖ అధ్యక్షులు డా. వెల్దండి శ్రీధర్ కు రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపక అవార్డు లభించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. శ్రీధర్ శుక్రవారం హైటెక్ సిటీలోని శిల్ప కళావేదిక లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు, అధికారుల చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోనున్నారు. డాక్టర్ వెల్దండి శ్రీధర్ గత రెండు సంవత్సరాలుగా నాగార్జున ప్రభుత్వ కళాశాలలో తెలుగు అధ్యాపకునిగా పనిచేస్తున్నారు.

సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రానికి చెందిన శ్రీధర్ మధ్యతరగతి పద్మశాలి కుటుంబంలో ఈశ్వరమ్మ, ఓదయ్య దంపతులకు జన్మించారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో హ్యుమానిటీస్ లో డిగ్రీ పూర్తి చేసిన శ్రీధర్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. తెలుగు చేశారు. అనంతరం అదే విశ్వవిద్యాలయంలో డాక్టర్ నందిని సిద్ధారెడ్డి పర్యవేక్షణలో “ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సాహిత్యం సమగ్ర పరిశీలన” అనే అంశంపై పిహెచ్. డి. పూర్తి చేశారు. కవిగా, కథకునిగా, విమర్శకులుగా ప్రసిద్ధి గాంచిన శ్రీధర్ ఇప్పటికే అనేక రచనలు చేశారు.

ఈ సందర్బంగా శ్రీధర్ ను ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్, వైస్ ప్రిన్సిపాల్స్ డా. పి. రవి కుమార్, డా. అంతటి శ్రీనివాస్, ఐక్యూఏసి కోఆర్డినేటర్ డా. వై.వి.ఆర్. ప్రసన్న కుమార్, పరీక్షల నియంత్రణాధికారి బి. నాగరాజు, అధ్యాపకులు డా. మునిస్వామి, డా. ఆదే మల్లేశం, డా. జ్యోత్స్న, డా. భాగ్యలక్ష్మి, డా. భట్టు కిరీటం, డా. శ్రీనివాస్ రెడ్డి, కోటయ్య, ఇతర అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు అభినందించారు.

MOST READ : 

  1. Nalgonda : జిల్లా ఎస్పీ సీరియస్.. అధిక ధరలకు యూరియా విక్రయిస్తున్న ఫర్టిలైజర్ యజమానిపై కేసు నమోదు..!

  2. Nalgonda : యూరియా కోసం ధర్నా, అరెస్ట్..!

  3. TG News : తెలంగాణలో రైతులకు భారీ శుభవార్త..!

  4. Holidays : విద్యార్థులకు మళ్లీ ఎగిరిగంతేసే న్యూస్.. వరుస సెలవులు..!

  5. Kavitha : టార్గెట్ హరీష్.. సంచలన ఆరోపణలు చేసిన కవిత..!

మరిన్ని వార్తలు