తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

District Collector : భూభారతిపై నల్గొండ జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. ప్రత్యక్షంగా పరిశీలన..!

భూభారతి దరఖాస్తులపై జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. గురువారం ఆయన నల్గొండ జిల్లా మిర్యాలగూడలో భూభారతి దరఖాస్తుల పై ప్రత్యక్షంగా పరిశీలించారు.

District Collector : భూభారతిపై నల్గొండ జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. ప్రత్యక్షంగా పరిశీలన..!

మిర్యాలగూడ, మన సాక్షి:

భూభారతి దరఖాస్తులపై జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. గురువారం ఆయన నల్గొండ జిల్లా మిర్యాలగూడలో భూభారతి దరఖాస్తుల పై ప్రత్యక్షంగా పరిశీలించారు.

భూభారతి కేసుల పరిష్కారంలో భాగంగా జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ నల్గొండ జిల్లా, మిర్యాలగూడ మండలం, కొత్తగూడెం శివారులోని ప్రభుత్వ భూములను పరిశీలించారు. మండలంలో ప్రభుత్వ భూములు, సీలింగ్ భూములపై తాసిల్దార్ తో విచారించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భూభారతి దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా పరిశీలించి తనిఖీ చేసిన తర్వాత తగు చర్యలు తీసుకోవాలని చెప్పారు. చట్ట ప్రకారం ప్రభుత్వ భూములను పరిరక్షించడంతోపాటు, గతంలో ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూముల లో సాగు చేసుకుంటున్న రైతులు, కౌలు రైతులు, తదితర వివరాలను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

భూభారతి కింద వచ్చిన దరఖాస్తులను జాప్యం లేకుండా పరిష్కరించేందుకు తహసిల్దార్లు చొరవ చూపాలన్నారు. జిల్లా కలెక్టర్ వెంట మిర్యాలగూడ తహసిల్దార్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

క్లిక్ చేసి చదవండి : 

  1. TG News : ఉద్యోగుల వేతనాల విడుదలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..!

  2. Gold Rates Today : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. మళ్లీ రూ.50వేలు తగ్గిన బంగారం ధర..!

  3. Rythu Bharosa : రైతు భరోసా కు లైన్ క్లియర్.. సీఎం రేవంత్ రెడ్డి తాజా ప్రకటన..!

  4. District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ఉద్యోగి సస్పెండ్..!

మరిన్ని వార్తలు