Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

Suryapet : రోడ్డు ఆక్రమించి వ్యాపారాలు చేయొద్దు..!

సూర్యాపేట పట్టణంలో ఆపరేషన్ రోప్ స్పెషల్ డ్రైవ్ చెప్పటారు. జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు సూర్యాపేట పట్టణంలో ప్రజల, వాహనదారుల సౌకర్యార్థం సూర్యాపేట పట్టణంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి "ఆపరేషన్ రోప్" కార్యక్రమం చేపట్టడం జరిగినదని సూర్యాపేట పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం అన్నారు.

Suryapet : రోడ్డు ఆక్రమించి వ్యాపారాలు చేయొద్దు..!

సూర్యాపేట, మనసాక్షి

సూర్యాపేట పట్టణంలో ఆపరేషన్ రోప్ స్పెషల్ డ్రైవ్ చెప్పటారు. జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు సూర్యాపేట పట్టణంలో ప్రజల, వాహనదారుల సౌకర్యార్థం సూర్యాపేట పట్టణంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి “ఆపరేషన్ రోప్” కార్యక్రమం చేపట్టడం జరిగినదని సూర్యాపేట పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం అన్నారు.

దీనిలో భాగంగా మంగళ వారం కుడ కుడ రోడ్డు లో ఉన్న ఆక్రమణలను మున్సిపాలిటీ అధికారులతో కలిసి తొలగించారు. అలాగే రోడ్డు పై ఉన్న మట్టి కుప్పలు, చెత్తను, రాళ్ళను తొలగించి రోడ్డు సక్రమంగా కనిపించేలా వినియోగించేలా చేశారు.

ముఖ్య పట్టణాల్లో ట్రాఫిక్ సమస్యలను అధిగమించడానికి, ప్రజలకు, వాహనదారులకు ఇబ్బంది కలగకుండా, ప్రమాదాలు జరగకుండా చేయడం, ఆక్రమణలు, అనధికారిక పార్కింగ్ తొలగించడం, వాహనాలు క్రమపద్ధతిలో వెళ్లడం అరైవ్ అలైవ్, రోడ్డు భద్రత కార్యక్రమంలో భాగంగా పట్టణాల్లో *ఆపరేషన్ రోప్* స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు సూర్యాపేట ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో చర్యలు చేపట్టారు.

MOST READ 

మరిన్ని వార్తలు