తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుహైదరాబాద్

District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. వాట్సాప్ లో ప్రజావాణి దరఖాస్తుల స్వీకరణకు శ్రీకారం..!

District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. వాట్సాప్ లో ప్రజావాణి దరఖాస్తుల స్వీకరణకు శ్రీకారం..!

  • వాట్సప్ నెంబర్ 74166 87878

మన సాక్షి, హైదరాబాద్ :

హైదరాబాద్ జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో కలెక్టర్లు కీలక పాత్ర పోషించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఆదేశించిన విషయం తెలిసిందే. అందుకుగాను హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరి చందన సంచలన నిర్ణయం తీసుకున్నారు. సీనియర్ సిటిజన్స్, దివ్యాంగులు, ఉద్యోగులకు ఉపయోగకరంగా ఉండే విధంగా వాట్సాప్ లో ప్రజావాణి దరఖాస్తుల స్వీకరణకు సోమవారం ఆమె శ్రీకారం చుట్టారు.

హైదరాబాద్ కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి నేరుగా వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే ప్రజావాణి కార్యక్రమానికి రావడానికి సీనియర్ సిటిజన్స్, దివ్యాంగులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు అయితే ప్రజావాణికి హాజరు కాలేకపోతున్నారు.

అందుకుగాను దానిని దృష్టిలో పెట్టుకొని జిల్లా కలెక్టర్ హరిచంద్ర వాట్సప్ ప్రజావాణి కార్యక్రమానికి ఆమె శ్రీకారం చుట్టారు. వాట్సప్ ద్వారా కూడా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. అందుకు వాట్సప్ నెంబర్ 74166 87878 కూడా కేటాయించారు.

వాట్సాప్ నెంబర్ కు ఫిర్యాదు చేస్తే వాటిని సిబ్బంది డౌన్ లోడ్ చేసుకుంటారని, ప్రత్యేకంగా నిర్వహించిన పోర్టల్ లో నమోదు చేసి ఫిర్యాదుదారుడికి ఐడి నెంబర్ కూడా కేటాయిస్తారని ఆమె తెలిపారు. అదేవిధంగా వారంలోపు ఆ ఫిర్యాదులపై తీసుకున్న చర్యల వివరాల సమాచారాన్ని కూడా వాట్సాప్ ద్వారా తెలియజేస్తారని ఆమె పేర్కొన్నారు.

MOST READ : 

  1. Srisailam : శ్రీశైలం, నాగార్జునసాగర్ కు వరద ప్రవాహం.. నిండుకుండలా ప్రాజెక్టులు..!

  2. Nalgonda : 15 నెలల కొడుకుని బస్టాండ్ లో వదిలేసిన యువతి.. ప్రియుడితో జంప్.. సర్వత్రా చర్చ..!

  3. Miryalaguda : ఎమ్మెల్యే కీలక ప్రకటన.. కస్తూరిబా పాఠశాల ఆకస్మిక తనిఖీ..!

  4. GST on UPI : ఫోన్ పే, గూగుల్ పే ద్వారా రూ.2వేలకు పైగా పేమెంట్లపై జిఎస్టి.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం..!

మరిన్ని వార్తలు