Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణమంచిర్యాల జిల్లా

District collector : జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు..!

District collector : జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు..!

మందమర్రి రూరల్, మన సాక్షి :

మందమర్రి మండల పరిధిలోని వెంకటాపూర్ గ్రామ శివారులో ని నర్సరీ క్రీడా ప్రాంగణాలను శుక్రవారం రోజు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పరిశీలించారు. అందులో భాగంగానే విద్యుత్ కేంద్రం నిర్మాణానికై స్థల పరిశీలన, అదేవిధంగా కేజీబీవీ మండల తాసిల్దార్ కార్యాలయాలను కూడా పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ మండలంలో విద్యుత్ సరఫరా లో అనేక సమస్యలు ఎదురవుతున్న సందర్భంగా మందమర్రి పాలవాగు దగ్గరలోని విద్యుత్ కేంద్రం నుండి విద్యుత్ సరఫరాలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయని,

సబ్ స్టేషన్ నుండి 10 కిలోమీటర్ల పైన ఉన్న గ్రామాలకు వ్యవసాయానికి గృహ అవసరాలకు అలాగే రైస్ మిల్లులకు ఒకే సబ్ స్టేషన్ ఉన్నందున నిత్యం విద్యుత్ సరఫరా లో అంతరాయం కలుగుతున్నందున మండల ప్రజల కోరిక మేరకు చెన్నూరు ఎమ్మెల్యే కార్మిక శాఖ మాత్యులు గడ్డం వివేక్ ఆదేశానుసారం కొత్త విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి స్థల పరిశీలన చేయడం జరిగిందని తెలియజేశారు.

ఆయన వెంట మండల తహసిల్దార్ సతీష్ కుమార్, ఎంపీ ఓ సత్యనారాయణ రెడ్డి మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ గణపతి, పంచాయతీ కార్యదర్శి తదితరులు ఉన్నారు.

MOST READ : 

  1. District collector : జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం.. 5.50 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను కేటాయింపుకు తీర్మానం..!

  2. Sub Collector : సబ్ కలెక్టర్ కీలక ఆదేశాలు.. బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి..!

  3. TATA : టాటా పవర్ సీఎఫ్‌ఓ సంజీవ్ చురివాలాకు సీఎఫ్‌ఓ ఆఫ్ ది ఇయర్ అవార్డు..!

  4. District collector : ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలపై జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం..!

మరిన్ని వార్తలు