District collector : మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్.. సిబ్బందికి ఆదేశాలు..!
District collector : మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్.. సిబ్బందికి ఆదేశాలు..!
నిజామాబాద్ జిల్లా భీంగల్, మన సాక్షి :
నిజామాబాద్ జిల్లా భీంగల్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలను శుక్రవారం జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఎంపీడీవో, తహసీల్దార్ తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ సిబ్బందిని ఆదేశించారు.
మధ్యాహ్న భోజనం, తాగునీటి సరఫరా, డైనింగ్ హాల్, క్లాస్ రూంలు, వంట గదులను స్వయంగా పరిశీలించారు. వంటకు పరిశుభ్రమైన నీటిని వినియోగించాలని, మెనూ ప్రకారం భోజనం అందించాలని సూచించారు. భోజనం వండటానికి ముందే ఆహార పదార్థాలను తనిఖీ చేయాలన్నారు.
నాసిరకం, నాణ్యతాలేమితో కూడిన పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లో వినియోగించకూడదని ఆదేశించారు. విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు..
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సిబ్బంది, ఎంపీడీవో, తహసీల్దార్, అధికారులు, తదితరులు ఉన్నారు.
MOST READ :
-
Rythu Bharosa : రైతు భరోసా డబ్బులు ఖాతాలలో పడలేదా.. అయితే ఇలా చేయండి..!
-
Nizamabad : దుబాయ్ లో గుండె పోటుతో నిజామాబాద్ జిల్లా వాసి మృతి..!
-
Holidays : విద్యార్థులకు అదురిపోయే న్యూస్.. ఈ నెల్లోనే వరుస సెలవులు..!
-
Gold Price : బంగారం ధర ఎలా నిర్ణయిస్తారు.. స్వచ్ఛత ఎలా.. అందరూ తెలుసుకోవాల్సిందే..!
-
CLP : సీఎల్పీ సమావేశంలో సంచలనం.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు రేవంత్ రెడ్డి ఆదేశాలు..!









