తెలంగాణBreaking Newsజగిత్యాల జిల్లాజిల్లా వార్తలువైద్యం

District collector : జిల్లా కలెక్టర్ ఆదేశం.. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి..!

District collector : జిల్లా కలెక్టర్ ఆదేశం.. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి..!

జగిత్యాల, (మన సాక్షి)

జగిత్యాల రూరల్ మండలం కల్లెడ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని  జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.
ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వర్షాకాలం సీజనల్ వ్యాధులు పై అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. డెంగ్యూ, మలేరియా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అవసరమైన మెడిసిన్ అందుబాటులో ఉంచుకోవాలని పేర్కొన్నారు.

ఆరోగ్య కేంద్రం చుట్టుపక్కల ఖాళీ స్థలంలో ఆవరణలో పిచ్చి మొక్కలు ముళ్ల చెట్లు తొలగించి వెంటనే శానిటేషన్ చేపించాలని, పేషంట్ల గదులలో శుభ్రంగా ఉండేలా చూడాలని, పరిసరాల పరిశుభ్రత పాటించాలని అధికారులకు సూచించారు. ఓ.పి సేవలు, రికార్డ్స్ ల్యాబ్ రికార్డ్స్, మెడికల్ ఫార్మసి  రిజిస్టర్ పరిశీలించి డాక్టర్లు తప్పనిసరిగా సమయపాలన పాటించాలని ఆదేశించారు.

ఆసుపత్రిలో వైద్య సేవలను గురించి నేరుగా పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట జగిత్యాల రెవెన్యూ డివిజనల్ అధికారి మధుసూదన్, డి ఎం హెచ్ ఓ డాక్టర్ ప్రమోద్ కుమార్, కల్లెడ పిహెచ్ సెంటర్ డాక్టర్ సౌజన్య సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. TG News: ప్రభుత్వం వారికి గుడ్ న్యూస్.. వారికి భరోసా, భీమా పథకములకు దరఖాస్తు స్వీకరణ..!

  2. Good News : రైతులకు గుడ్ న్యూస్.. అన్నదాత సుఖీభవ డేట్ ఫిక్స్.. ఆ రోజే రైతుల ఖాతాలలో డబ్బులు జమ..!

  3. Devarakonda : దేవరకొండ సిఐ గా బాధ్యతలు చేపట్టిన వెంకట్ రెడ్డి.!

  4. Nalgonda : మైనర్ బాలికను అత్యాచారం చేసిన కేసులో సంచలనమైన తీర్పు..!

మరిన్ని వార్తలు