జిల్లా వార్తలుBreaking Newsతెలంగాణమెదక్

District collector : భూ భారతి దరఖాస్తులపై జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు..!

District collector : భూ భారతి దరఖాస్తులపై జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు..!

కొల్చారం, మన సాక్షి :

భూ భారతి దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలనీ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కోల్చారం మండల కేంద్రంలోనీ తహసీల్దార్ కార్యాలయాన్ని అకస్మాత్తుగా తనిఖీ చేశారు.

భూ భారతి పెండింగ్ దరఖాస్తులను, భూ రికార్డులను, హాజరు పుస్తకాల్ని పరిశీలించారు. వివిధ భూ సమస్యలతో తహసీల్దార్ కార్యాలానికి వచ్చిన భూ బాధితులతో మాట్లాడారు. వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ తహసీల్దార్ కార్యాలయంలో పెండింగ్ లో ఉన్న భూ భారతి దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలన్నారు.

భూ సమస్యలతో వచ్చిన ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండి వారి సమస్యలకు పరిష్కారాన్ని సూచించాలన్నారు. భూ సమస్యల వల్ల ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా అధికారులు వారికి అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Khammam : హోటళ్లు, వ్యాపార సంస్థలో ఆకస్మిక దాడులు.. జరిమానా..!

  2. District collector : ధాన్యం సేకరణ పై కంట్రోల్ రూమ్ ఏర్పాటు.. ఫిర్యాదులకు ఫోన్ నెంబర్..!

  3. TG News : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మేఘా జాబ్ మేళా.. 150 కంపెనీలు 10 వేల ఉద్యోగాలు..!

  4. TG News : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మేఘా జాబ్ మేళా.. 150 కంపెనీలు 10 వేల ఉద్యోగాలు..!

మరిన్ని వార్తలు