District collector : వరదలపై జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. అధికారులకు సూచన..!
District collector : వరదలపై జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. అధికారులకు సూచన..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
వరదల సమాచారంపై ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తంగా ఉండి ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో వరద నివారణ పై తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై ఎస్పీ యోగేష్ గౌతమ్ అదనపు కలెక్టర్ సంచిత గంగ్వర్ తో అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని నదుల ప్రవాహం మొదటి దశ ఎంత, ప్రమాద స్థాయి ఎంత పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నదీ తీర గ్రామాలలో మక్తల్ 10, మాగనూర్ 4, కృష్ణ 4 గ్రామాలు ఉన్నాయని వాటికి ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.
జిల్లాలో ఎన్ని షెల్టర్స్ గుర్తించారని కలెక్టర్ అడిగారు. గుర్తించిన షెల్టర్స్ భవనాల రిపోర్ట్ ను వెంటనే ఇవ్వాలన్నారు. ఎస్పీడీసీఎల్ విద్యుత్ శాఖ వారి యాక్షన్ ప్లాన్ ఇవ్వాలని ఎస్ ఈ నీ ఆదేశించారు. జిపి ల దగ్గర వాటర్ ట్యాంకర్స్ జిపి లలో బ్లీచింగ్ పౌడర్ వేయాలని, మిషన్ భగీరథ అధికారులు యాక్షన్ ప్లాన్ఇవ్వాలని తెలిపారు. ఓల్డ్ ఏజ్ ఉమెన్ అందర్వి అన్ని వివరాలు ఉంచుకోవాలన్నారు.
బోట్స్ ఫిషర్ మాన్ పంప్స్ లైవ్ జాకెట్స్ జెసిబి ట్రాక్టర్స్ ఎమర్జెన్సీ లైట్స్ వాకి టాకీ అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. పశుసంవర్ధక శాఖ వారు వరదలపై జంతువుల రక్షణ కొరకు చర్యలు తీసుకోవాలన్నారు. వైద్యశాఖ పరిధిలో ఆశా వర్కర్లు సూపర్వైజర్లు అందరిని అప్రమత్తం చేయాలని ఆదేశించారు. ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటుకు చేయాలన్నారు.
ఎస్పీ యోగేష్ గౌతమ్ మాట్లాడుతూ ఎల్లో లెవెల్, ఆరెంజ్ లెవెల్ వరదల సమయంలో అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. వరదల్లో ఆహారము త్రాగునీరు షెల్టర్ విద్యుత్తు రవాణా వాహనాల సదుపాయం తదితర వాటిని ప్రమాద గ్రామాలైన 18 గ్రామపంచాయతీలలో అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.
అధికారులు అందరు హెడ్ క్వార్టర్ లో ఉండాలి అని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్డీవో రామచందర్, మక్తల్, కృష్ణ, మాగనూరు తాసిల్దారులు, విద్యుత్తు, మిషన్ భగీరథ, వ్యవసాయ పశువైద్య వైద్య తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.









