District Collector : జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.. విద్యార్థులతో కలిసి భోజనం..!

District Collector : జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.. విద్యార్థులతో కలిసి భోజనం..!
జగిత్యాల, (మన సాక్షి) :
పిఏం పోషణ్ ‘ పరిశీలన లో భాగంగా కథలాపూర్ మండలంలోని జిల్లా పరిషత్ పాఠశాలను శుక్రవారం జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో నేరుగా మాట్లాడి ఏవైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల ఆరోగ్యం, విద్యల పట్ల శ్రద్ధ చూపాలని ఉపాధ్యాయులకు సూచించారు.
అనంతరం భోజనం నిర్వహణను, వంట సరుకుల నాణ్యతను, స్టోర్ రూమ్ లో గల బియ్యం నాణ్యతను పరిశీలించి వంట నిర్వాహకులను ప్రభుత్వ ఆదేశానుసారం మెను ప్రకారంగా, శుభ్రమైన వాతావరణంలోనే విద్యార్థులకు వండి వడ్డించాలని సూచించారు. పాఠశాలలో ఉన్నటువంటి ఖాళీ స్థలంలో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేయాలని సూచించారు.
విద్యాలయం చుట్టూ ఉన్న పరిసరాల శుభ్రతను పరిశీలించారు.విద్యార్థులతో కలిసి భోజనం చేసి భోజన తీరు పట్ల కొన్ని విషయాలను ఉపాధ్యాయులకు తగు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట కోరుట్ల రెవెన్యూ డివిజనల్ అధికారి జీవాకర్ రెడ్డి, డిఈఓ కే. రాము, తహసిల్దార్ వినోద్ కుమార్, ఎంపీడీవో శంకర్, ఎంఈఓ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
MOST READ :
-
Bus Accident : కర్నూలు బస్సు దగ్ధం ఘటనపై ప్రత్యక్ష సాక్షి ఏం చెప్పిందంటే.. (వీడియో)
-
Bus Accident : ఘోర ప్రమాదం.. దగ్దమైన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.. 20 మందికి పైగా మృతి..!
-
District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. కపాస్ కిసాన్ యాప్ పై రైతులకు పూర్తి అవగాహన కల్పించాలి..!
-
Gold Price : బంగారం ధరలు ఎవరు నిర్ణయిస్తారో.. ఎలా నిర్ణయిస్తారో తెలుసా..!










