తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

District Collector : జిల్లా కలెక్టర్ హెచ్చరిక.. మూసి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..!

District Collector : జిల్లా కలెక్టర్ హెచ్చరిక.. మూసి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..!

నల్లగొండ, మన సాక్షి:

మూసి ప్రాజెక్ట్‌కు ఎగువ నుండి నిరంతరంగా నీరు వచ్చి చేరుతున్నందున ఈ నెల 25 న ఉదయం 8 గంటలకు మూసి ప్రాజెక్టు క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటినీవదులుతున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. అందువల్ల మూసి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె కోరారు.

ప్రస్తుతం మూసీ నదిలోకి 1427 క్యూసెక్కుల ప్రవాహం నమోదవుతున్నదని , ఈ నేపథ్యంలో, రిజర్వాయర్ నీటిమట్టం 645.00 అడుగుల పూర్తి స్థాయికి బదులుగా, 643.00 అడుగుల వద్ద నిర్వహించడానికి గాను రేపు, అనగా జూలై 25 న ఉదయం 8:00 గంటలకు మూసి ప్రాజెక్ట్ క్రెస్ట్ గేట్లను ఎత్తి 1260 క్యూసెక్కుల నీటిని మూసి నదిలోకి విడుదల చేయనున్నట్లు తెలిపారు. అందువల్ల నల్గొండ జిల్లాలలోని మూసి నది పొడవునా ఉన్న ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, నదిలోకి మనుషులను , పశువులను పంపవద్దని కోరారు.

ముఖ్యంగా జిల్లాలోని కేతేపల్లి, మాడుగులపల్లి, మిర్యాలగూడ మండలాల్ పరిధిలోని బొప్పారం, కాసనగోడే, చీకటిగూడెం, కోత్తపేట, ఉప్పలపహాడ్, కొప్పోలె, భీమారం, అమంగల్ , లక్ష్మీదేవి గూడెం, రావులపెంట, రాజపేట, నర్సింహుల్‌గూడ, తక్కెలపాడు, కల్వపల్లి, అలగడప, రాయన్‌పాలెం, ముల్కల్ కల్వ, కేశవాపూర్, తుంటుకుంట, వాడపల్లి, వజీరాబాద్ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

MOST READ : 

  1. District collector : పంతులమ్మగా జిల్లా కలెక్టర్..!

  2. District collector : జిల్లా కలెక్టర్ హెచ్చరిక.. వారిపట్ల అమర్యాదగా ప్రవర్తిస్తే చర్యలు..!

  3. Ration Cards : కొత్త రేషన్ కార్డుదారులకు బంపర్ ఆఫర్.. ప్రభుత్వం తాజా నిర్ణయం..!

  4. Oil Farm : రైతులకు అదిరిపోయే శుభవార్త.. ఎకరానికి రూ.50 వేల రాయితీ.. దరఖాస్తుల ఆహ్వానం..!

  5. District collector : జిల్లా కలెక్టర్ సీరియస్ వార్నింగ్.. అలాంటి వారిపై క్రిమినల్ కేసులు.. టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు..!

మరిన్ని వార్తలు