Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

District collector : జిల్లా కలెక్టర్ సీరియస్ వార్నింగ్.. అలాంటి వారిపై క్రిమినల్ కేసులు.. టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు..!

District collector : జిల్లా కలెక్టర్ సీరియస్ వార్నింగ్.. అలాంటి వారిపై క్రిమినల్ కేసులు.. టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు..!

నల్లగొండ, మన సాక్షి :

యూరియాను వ్యవసాయ పనులకు కాకుండా ఇతర పనులకు దారిమళ్లిస్తే సంబంధిత ఎరువుల దుకాణం యజమానితో పాటు , సంబంధితుల పై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు.

నల్గొండ జిల్లాలో ఎరువులకు ఎలాంటి కొరతలేదని స్పష్టం చేశారు. మంగళవారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎరువుల పై ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన “ఎరువుల ఫిర్యాదుల కేంద్రాన్ని” ,టోల్ ఫ్రీ నెంబర్ (18004251442 ) ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆగస్టు మొదటి వారంలో నాగార్జునసాగర్, మిర్యాలగూడ నియోజకవర్గాలకు సాగునీరు వస్తున్నప్పటికీ, అలాగే జిల్లా వ్యాప్తంగా ముమ్మర వ్యవసాయ సాగు, విత్తనాలు, నాట్లు వేసే సమయంలో సైతం అవసరమైనన్ని ఎరువులను సరఫరా చేసేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని తెలిపారు.

ఎరువులకు ఎవరూ కంగారు పడాల్సిన పని లేదని అన్నారు. రాష్ట్ర ముఖ్య మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు ఎరువులను అందుబాటులో ఉంచడంజరిగిందని, ఎవరికైనా ఎరువులకు సంబంధించి ఇబ్బంది ఉంటే ప్రత్యేకంగా ఎరువుల పై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 18004251442 కు
ఫోన్ చేయాలని తెలిపారు.

ఒకేసారి 30 లేదా 40 బస్తాల ఎరువులను తీసుకువెళ్లే వారి పై చర్య తీసుకుంటామన్నారు. ఎరువుల పర్యవేక్షణ కై ప్రతి మండలానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించడం జరిగిందని, తహసిల్దారులు, మండల వ్యవసాయ అధికారులు ఎరువుల దుకాణాలను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని ఆదేశించారు.

మిర్యాలగూడ ఎరువుల గోదామును ఎప్పటికప్పుడు తాము సందర్శిస్తున్నామని, ఈ నెలాఖరులోగా జిల్లాకు 3000 మెట్రిక్ టన్నుల యూరియా రానున్నదని స్పష్టం చేశారు. ఎరుల దుకాణం యజమానులు దుకాణం ముందు తప్పనిసరిగా ఎరువుల నిల్వలపై బోర్డులను ఏర్పాటు చేయాలని, అందరికీ తెలిసే విధంగా ఎరువుల వివరాలు ప్రదర్శించాలని, ఏరోజుకారోజు ఎరువుల స్టాక్ వివరాలను అబోర్డుపై నమోదు చేయాలని చెప్పారు.

ఎవరైనా ఎరువుల విషయంలో అక్రమాలకు పాటుపడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్,జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్, కలెక్టర్ కార్యాలయ ఏవో మోతిలాల్, తదితరులు ఉన్నారు.

MOST READ : 

  1. TG News : జిల్లా కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు.. సామాన్యులకు ఊరుట..!

  2. Liquor : స్పిరిట్ నింపి, లేబుల్స్ అంటించి.. ఈ ముఠా మామూలోళ్లు కాదు..!

  3. Suryapet : సూర్యాపేటలో భారీగా.. 18 కిలోల బంగారం దోపిడీ..!

  4. UPI : ఫోన్ పే, గూగుల్ పే లో బ్యాలెన్స్ చెక్ చేసే అలవాటు మీకు ఉందా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే..!

  5. ACB : రైతు నుంచి రూ.2 లక్షలు లంచం డిమాండ్.. ఎసిబికి చిక్కిన డిప్యూటీ తహసీల్దార్..!

మరిన్ని వార్తలు