Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsజాతీయంటెక్నాలజీ

UPI : ఫోన్ పే, గూగుల్ పే లో బ్యాలెన్స్ చెక్ చేసే అలవాటు మీకు ఉందా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే..!

UPI : ఫోన్ పే, గూగుల్ పే లో బ్యాలెన్స్ చెక్ చేసే అలవాటు మీకు ఉందా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా యూపీఐ ద్వారా డిజిటల్ లావాదేవీలు ఎక్కువగా కొనసాగుతున్నాయి. ఐదు రూపాయల నుంచి లక్షల రూపాయల వరకు కూడా యూపీఐ ద్వారానే లావాదేవీలు కొనసాగుతున్నాయి. అయితే ఒక్కోసారి మనం పంపిన అమౌంట్ అవతలివారికి చేరకుండా ప్రాసెస్ లో ఉంటుంది. దాంతో పాటు మనం ఎక్కువగా యూపీఐ యాప్ లు ఫోన్ పే, గూగుల్ పే, పేటియం లాంటివి వినియోగిస్తుంటాము.

లావాదేవీలు పూర్తికాగానే బ్యాలెన్స్ చెక్ చేస్తూ ఉంటాము. అయితే పదే పదే బ్యాలెన్స్ చెక్ చేయడం మీకు అలవాటు ఉంటే.. అది తగ్గించుకోవాల్సి ఉంది. ఆగస్టు 1వ తేదీ నుంచి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కొత్త నిబంధన తీసుకురాబోతుంది. ప్రస్తుతం ఫోన్ పే, గూగుల్ పే, పేటియం యాప్ లలో ఎన్నిసార్లు బ్యాలెన్స్ చెక్ చేసుకున్నా. కూడా ఎలాంటి చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు.

కానీ ఆగస్టు 1వ తేదీ నుంచి నేషనల్ పేమెంట్స్ ఆఫ్ కార్పొరేషన్ కొత్త నిబంధన ప్రకారం రోజుకు 50 సార్లు మాత్రమే బ్యాలెన్స్ చెక్ చేసుకునే అవకాశం ఉంది. అంతకంటే ఎక్కువ పర్యాయాలు బ్యాలెన్స్ చెక్ చేసుకుంటే చార్జి చెల్లించాల్సి ఉంటుంది.

అదేవిధంగా మనం ఎవరికైనా పంపిన లావాదేవీలు చెక్ చేసుకోవడానికి ప్రాసెస్ లో ఉంటే చెక్ చేయడానికి కేవలం ఎట్ ఎ టైం మూడు పర్యాయాలు మాత్రమే చూడాల్సి ఉంటుంది. ఆ తర్వాత 90 సెకండ్ల తర్వాత మళ్లీ చూసుకోవచ్చు. కానీ వెంట వెంటనే చూసే అవకాశం లేదు.

Similar News : 

  1. UPI : ఫోన్ పే, గూగుల్ పే లో బ్యాలెన్స్ చెక్ చేస్తున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే..!
  2. UPI : యూపీఐ చెల్లింపుల్లో నయా మోసం.. క్షణాల్లో ఖాతా ఖాళీ..!
  3. UPI : ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా.. యూపీఐ లావాదేవీలకు కేంద్రం గుడ్ న్యూస్..!
  4. UPI : యూపీఐ చెల్లింపుల్లో నయా మోసం.. క్షణాల్లో ఖాతా ఖాళీ..!

మరిన్ని వార్తలు