Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsజాతీయం

UPI : ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా.. యూపీఐ లావాదేవీలకు కేంద్రం గుడ్ న్యూస్..!

UPI : ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా.. యూపీఐ లావాదేవీలకు కేంద్రం గుడ్ న్యూస్..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

యూపీఐ యూజర్లకు కేంద్రం గుడ్ న్యూస్ తెలియజేసింది. చిన్న మొత్తంలో నిర్వహించే యూపీఐ లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 2024 -25 ఆర్థిక సంవత్సరానికి గాను 1500 కోట్ల రూపాయలను కేటాయించింది. తక్కువ విలువలతో కూడిన యూపీఐ లావాదేవీలకు (వ్యక్తి నుంచి వ్యాపారికి) ఈ స్కీం కింద ఆర్థిక ప్రోత్సాహాలు ఇవ్వాలని నిర్ణయించింది.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. క్యాబినెట్ బేటి అనంతరం నిర్ణయాలను కేంద్రమంత్రి అశ్వని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. 2024 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2025 మార్చి 31 వరకు ఈ ప్రోత్సాహాల కింద 1500 కోట్ల రూపాయలను చెల్లించేందుకు క్యాబినెట్ నిర్ణయించింది. దానివల్ల చిన్న వ్యాపారులకు లబ్ధి చేకూరనున్నది.

లావాదేవీలు అనుమతించినందుకు గాను చిన్న వ్యాపారులు ఒక్కో లావాదేవికి 0.15 శాతం చొప్పున ప్రోత్సాహకం కింద అందుకుంటారు. ఆపై మొత్తాల పై ఎలాంటి ప్రోత్సాహకాలు ఉండవు. ప్రస్తుతం యూపీఐ లావాదేవీలు MDR చార్జీలు వర్తించడం లేదు. వచ్చే ఏడాది కూడా ఈ స్కీం కొనసాగుతుందని మంత్రి తెలిపారు.

Similar News : 

  1. UPI : ఫోన్ పే, గూగుల్ పే యూజర్లకు భారీ జలక్.. ఇకపై వాటికి చార్జీల మోత..!
  2. UPI : ఫిబ్రవరి 1 నుంచి ఆ యూపీఐ లావాదేవీల నిలిపివేత.. ఫోన్ పే, జి పే వినియోగదారులు తెలుసుకోవల్సిందే..!
  3. UPI : గూగుల్ పే ఫోన్ పే వాడుతున్నారా.. అయితే జనవరి కొత్త రూల్స్, తప్పక తెలుసుకోవాల్సిందే..!
  4. UPI : ఫోన్ పే, గూగుల్ పే లో వెంటనే ఇది ఆఫ్ చేయండి.. లేదంటే మీ ఎకౌంటు ఖాళీ..!

మరిన్ని వార్తలు