ACB : రైతు నుంచి రూ.2 లక్షలు లంచం డిమాండ్.. ఎసిబికి చిక్కిన డిప్యూటీ తహసీల్దార్..!
ACB : రైతు నుంచి రూ.2 లక్షలు లంచం డిమాండ్.. ఎసిబికి చిక్కిన డిప్యూటీ తహసీల్దార్..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
పట్టాదార్ పాస్ పుస్తకం కోసం ఓ రైతు నుంచి 2 లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేసిన డిప్యూటీ తాసిల్దార్ ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఉమ్మడి మెదక్ జిల్లా ఎసిబి డిఎస్పి సుదర్శన్ తెలియజేసిన వివరాల ప్రకారం..
ములుగు మండలంలోని సిగన్నగూడ రైతుకు చెందిన 16 గుంటల భూమికి పట్టాదార్ పాస్ పుస్తకం కోసం తాసిల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. అయితే డిప్యూటీ తాసిల్దార్ భవాని రైతు వద్ద రెండు లక్షల రూపాయల లంచం డిమాండ్ చేసింది. కాగా ఆ రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దాంతో శుక్రవారం ఏసీబీ అధికారులు తాసిల్దార్ కార్యాలయంలో సోదాలు నిర్వహించి డిప్యూటీ తాసిల్దార్ భవానిని పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
తీరు మారని తహసిల్దార్ కార్యాలయాలు :
తహసిల్దార్ కార్యాలయం అంటేనే అవినీతికి అడ్డాలుగా మారాయి. రాష్ట్రవ్యాప్తంగా అటెండర్ నుంచి ఉన్నతాధికారి వరకు కూడా లంచాల అవతారం ఎత్తుతున్నారు. ఇటీవల తాసిల్దార్ కార్యాలయాల్లో అటెండర్, కంప్యూటర్ ఆపరేటర్లు సహా ఏసీబీ అధికారులకు చిక్కిన విషయం తెలిసిందే. అయినా కూడా అధికారులు తీరు మారడం లేదు. లంచం లేనిదే పని జరగడం లేదని పలువురు పేర్కొంటున్నారు.
MOST READ :
-
Big Alert : తెలంగాణలో భారీ వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశం..!
-
TG News : యూరియా, ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే ఫిర్యాదుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు..!
-
TG News : తెలంగాణలో నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. నెలకు రూ.1000.. దరఖాస్తు ఇలా..!
-
Holiday : విద్యార్థులకు సంతోషకరమైన న్యూస్.. ఆరోజు మరో సెలవు..!









