Big Alert : తెలంగాణలో భారీ వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశం..!
Big Alert : తెలంగాణలో భారీ వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశం..!
మన సాక్షి, హైదరాబాద్ :
హైదరాబాద్‌కు ఆరెంజ్ అలెర్ట్ జారీ, ఈ రాత్రికి (18 న) భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్‌గిరి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలు, గ్రేటర్ పాటు యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. 40 నుంచి 60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం :
హైదరాబాదులో భారీ వర్షం నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, వాటర్ వర్క్స్ , విద్యుత్, పోలీస్ సిబ్బంది సమన్వయంతో పని చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, హైడ్రా బృందాలు, ఇతర విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, వర్షంతో ఇబ్బందులు పడుతున్న ప్రాంతాల్లో ప్రజలు పిర్యాదు చేసిన వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
MOST READ :
-
Holiday : విద్యార్థులకు సంతోషకరమైన న్యూస్.. ఆరోజు మరో సెలవు..!
-
TG News : యూరియా, ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే ఫిర్యాదుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు..!
-
TG News : తెలంగాణలో నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. నెలకు రూ.1000.. దరఖాస్తు ఇలా..!
-
District collector : అక్రమ కట్టడాలపై జిల్లా కలెక్టర్ సీరియస్.. నోటీసులు జారీ చేయాలని ఆదేశం..!









