Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

District SP : జిల్లా ఎస్పీ కీలక ఆదేశాలు.. పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ..!

District SP : జిల్లా ఎస్పీ కీలక ఆదేశాలు.. పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ..!

పెన్ పహాడ్, మనసాక్షి:

సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండల పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ నరసింహ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ లోని పరిసరాలను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ డైరీ, రిసెప్షన్ రిజిస్టర్ తనిఖీ చేసి, మండల పరిధిలో నమోదవుతున్న నేరాలు తీరుతెన్ను లు కేసుల స్థితిగతులు మొదలగు అంశాలను పరిశీలించారు.

పోలీస్ సిబ్బంది ఎల్లప్పుడు, ప్రజలకు అందుబాటులో ఉండాలి, బాధితులకు సత్వర సేవలు అందించాలని ఆదేశించారు, నాణ్యమైన వేగవంతమైన దర్యాప్తు చేయాలని బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని సూచించారు. గ్రామ రిజిస్టర్లు, హిస్టరీ సీట్స్, రౌడీ సీడ్స్, సస్పెక్ట్ సీట్స్ ను, ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని అన్నారు.

బ్లూ కొట్టు విధులు, పెట్రో కార్ విధులు, ప్రధానమైనవి సంఘటన స్థలాన్ని త్వరగా చేరుకొని ,ప్రాథమికంగా బాధితులకు భరోసా కల్పించాలని సూచించారు, కేసులు పెండింగ్ ఉండకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి తెలిపారు. జట్టుగా పనిచేస్తూ లక్ష్యంతో ముందుకెళ్లే పోలీస్ అనుకున్న విజయాలను సాధించవచ్చు అని ఎస్పి కోరారు.

ఈ కార్యక్రమంలో డి. ఎస్. పి ప్రసన్నకుమార్, సిఐ రాజశేఖర్, ఎస్ బి సి ఐ రామారావు, ఆర్. ఎస్. ఐ . అశోక్, ఎస్ఐ కస్తాల గోపికృష్ణ, పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు, అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో జిల్లా ఎస్పీ నర్సింహన్ మొక్కలు నాటారు.

MOST READ :

  1. Gold Medal : యంవిఎన్ విజ్ఞాన కేంద్రం విద్యార్థినికి గోల్డ్ మెడల్.. ప్రముఖుల అభినందనలు..!

  2. TG News : రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు ప్రభుత్వ పాఠశాల విద్యార్థినిల ఎంపిక..!

  3. TG News : ఆ ఉద్యోగులే లక్ష్యంగా ఘరానా మోసం.. రూ.20 కోట్ల దోపిడి..!

మరిన్ని వార్తలు