Narayanpet : జిల్లా ఎస్పీ హెచ్చరిక.. వారిని పనిలో పెట్టుకుంటే చట్ట ప్రకారం కఠిన చర్యలు..!

Narayanpet : జిల్లా ఎస్పీ హెచ్చరిక.. వారిని పనిలో పెట్టుకుంటే చట్ట ప్రకారం కఠిన చర్యలు..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
రాష్ట్రవ్యాప్తంగా జూలై 1 నుండి ఆపరేషన్ ముస్కాన్ ప్రారంభమైన సందర్భంగా నారాయణపేట జిల్లా పరిధిలో మొత్తం 30 మంది బాలా కార్మికులను ఆపరేషన్ ముస్కాన్ టీం పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అందులో 22 మంది బాలురు, 08 బాలికలను బాల సంరక్షణ గృహాలకు తరలించడం జరిగింది అని తెలిపారు.
అనంతరం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ద్వారా వారికి కౌన్సెలింగ్ ఇచ్చి విద్యార్థులను పాఠశాలలో చేర్పిస్తామని తెలిపారు. పనిలో పెట్టుకున్న వారికి జరిమానా విధించడంతో పాటు కేసులు నమోదు చేస్తామని తెలిపారు. జిల్లా పరిధి లో ఎవరైనా 18 సంవత్సరాలు లోపు పిల్లలను పనిలో పెట్టుకుంటే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.
ప్రతి ఒక్కరి జీవితంలో బాల్యం అమూల్యమైందని దానిని అనుభవించటం ప్రతి పౌరుని యొక్క హక్కు అని పేర్కొన్నారు. కొంతమంది పిల్లలను పనిలో పెట్టుకుని వారిని ప్రమాదకర పనులు చేయిస్తూ వారి జీవితాలతో ఆడుకుంటున్నారని అలాంటి వారిని గుర్తించి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
నారాయణపేట జిల్లా పరిధిలో ఎవరైనా చిన్న పిల్లల్ని పనులకు పంపించిన, వెట్టిచాకిరి చేయించిన వారి సమాచారాన్ని ప్రజలు 1098 కి గాని లేదా112, డయల్ 100 కి సమాచారం ఇవ్వాలని ఎస్పీ కోరారు.
MOST READ :
-
New Ration Cards : కొత్త రేషన్ కార్డుల జారీపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన.. బిగ్ అప్డేట్..!
-
District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. ఎరువుల దుకాణాల ఆకస్మిక తనిఖీ..!
-
Gold Price : ఒక్కరోజే రూ.6600 తగ్గిన బంగారం ధర.. ఈరోజు ఎంతంటే..!
-
TG News : తెలంగాణ మహిళలకు భారీ శుభవార్త.. 65 లక్షల మందికి కానుక..!
-
Nagarjuna Sagar : కృష్ణమ్మ పరవళ్ళు.. నాగార్జునసాగర్ కు జలకళ.. లేటెస్ట్ అప్డేట్..!









