Ration Card : రేషన్ కార్డు ఉందా.. అయితే మీకు గుడ్ న్యూస్..!
Ration Card : రేషన్ కార్డు ఉందా.. అయితే మీకు గుడ్ న్యూస్..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణ ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు ఉన్న పేదలందరికీ శుభవార్త తెలియజేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంది. అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు రవాణా సౌకర్యం కల్పించింది.
దాంతోపాటు ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయల వరకు పెంచింది. మహిళలకు వంటగ్యాస్ ను 500 రూపాయలకే అందజేస్తుంది. అదేవిధంగా పేదలకు 200 యూనిట్ల వరకు గృహ విద్యుత్తును ఉచితంగా అందజేస్తుంది. దాంతో పాటు ఇటీవల రైతులకు కూడా రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసింది.
ఇదిలా ఉండగా ఎన్నికల హామీలలో భాగంగా తెల్ల రేషన్ కార్డుదారులందరికీ సన్న బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయంపై ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
తెల్ల రేషన్ కార్డుదారులందరికీ జనవరి 2025 నుంచి సన్నబియ్యం ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 39 లక్షలకు పైగా తెల్ల రేషన్ కార్డులు ఉండగా అందరికీ కూడా సంక్రాంతిలో సన్న బియ్యం పంపిణీ ప్రారంభం కానున్నది.
MOST READ :
-
Runamafi : రుణమాఫీ కాని వారికి గుడ్ న్యూస్.. అందరికీ మాఫీ.. డేట్ ఫిక్స్..!
-
Gold Price : పసిడి ప్రియులకు మరింత ఆనందం.. దిగివచ్చిన బంగారం ధరలు..!
-
Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ లో ముగిసిన చిరుమర్తి విచారణ.. రెండు నెంబర్లు ఇచ్చాను..!
-
Family Survey : విద్యార్థులచే సమగ్ర సర్వే.. నిలదీసిన ఇంటి యజమాని.. (వీడియో వైరల్)









