Family Survey : విద్యార్థులచే సమగ్ర సర్వే.. నిలదీసిన ఇంటి యజమాని.. (వీడియో వైరల్)
Family Survey : విద్యార్థులచే సమగ్ర సర్వే.. నిలదీసిన ఇంటి యజమాని.. (వీడియో వైరల్)
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణలో కొనసాగుతున్న కుటుంబ సమగ్ర సర్వే అబాసుపాలవుతున్నది. సర్వేలో వ్యక్తిగత విషయాలు కూడా అడుగుతున్నారంటూ వ్యతిరేకత వచ్చిన విషయం తెలిసిందే. కొన్ని గ్రామాలలో సర్వేను బహిష్కరించడం కూడా జరిగింది.
ఇదిలా ఉండగా విద్యార్థులచే కుటుంబ సమగ్ర సర్వే చేపడుతున్న విషయం వెలుగులోకి వచ్చింది. హైదరాబాదులో సర్వే కోసం ఓ విద్యార్థి ఇంటికి వద్దకు వెళ్లారు. కాగా అతను ప్రభుత్వ ఉద్యోగి కాదని గుర్తించిన ఆ ఇంటి యజమాని విద్యార్థిని నిలదీశాడు.
తనకు డబ్బులు ఇస్తామని చెప్పడంతో సర్వేకు వచ్చానని, తాను విద్యార్థిని అని, తనను పంపిన సూపర్వైజర్ మున్సిపాలిటీలో పని చేస్తాడని చెప్పాడు. ప్రభుత్వ వివరాలు చెప్పాలని ప్రభుత్వం ఓ పక్కన చెబుతుంటే విద్యార్థులచే సర్వే చేయించడం ఏంటని ఆ కుటుంబ యజమాని అతనిని నిలదీశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Video :
ప్రైవేట్ వ్యక్తులతో కుల గణన సర్వే
విద్యార్థులతో సర్వే చేస్తుండటంతో ప్రశ్నించిన కుటుంబ యజమాని pic.twitter.com/kLW63XdqWW
— Telugu Scribe (@TeluguScribe) November 13, 2024
MOST READ :









