Pimples: నుదుటిపై మొటిమలతో బాధపడుతున్నారా.. ఇలా చేస్తే మచ్చలతో సహా పోతాయి..!

Pimples: నుదుటిపై మొటిమలతో బాధపడుతున్నారా.. ఇలా చేస్తే మచ్చలతో సహా పోతాయి..!
మన సాక్షి, ఫీచర్స్ :
పోషకాహార లోపంతో పాటు కాలుష్యం, దుమ్ము, ధూళి వంటి కారణాల వల్ల అమ్మాయిల ముఖంపై మొటిమలు, నల్ల మచ్చలు ఏర్పడుతుంటాయి. ముఖ్యంగా నుదుటిపై ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. వీటిని పట్టించుకోకపోతే సమస్య మరింత తీవ్రమవుతుంది.
నుదుటిపై మొటిమలను తగ్గించుకోవడానికి మార్కెట్లో లభించే రసాయన ఉత్పత్తులను వాడటం వల్ల కొన్ని దుష్ప్రభావాలు ఉండవచ్చు. అందుకే, ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి సహజసిద్ధమైన పద్ధతులను ఎంచుకోవాలని సౌందర్య నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
దాల్చిన చెక్కతో మొటిమలకు చెక్
వంటకాల రుచిని పెంచే దాల్చిన చెక్క చర్మ సమస్యలను కూడా తగ్గించగలదు.
ఎలా వాడాలి: దాల్చిన చెక్క పొడి తీసుకుని, దానికి కొద్దిగా తేనె కలపండి. ఈ పేస్ట్‌ను నుదుటిపై ఉన్న మొటిమల మీద అప్లై చేయండి. ఇలా కొన్ని రోజుల పాటు క్రమం తప్పకుండా చేస్తే మొటిమలు తగ్గిపోతాయి.
కలబంద (అలోవెరా)తో మృదువైన చర్మం
కలబంద వల్ల కలిగే ప్రయోజనాలు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో పోషకాలున్న అలోవెరా జెల్‌ను చర్మంపై రాయడం వల్ల చర్మం మృదుత్వాన్ని సంతరించుకుంటుంది.
ఎలా వాడాలి: రాత్రి పడుకునే ముందు నుదుటిపై ఉండే మొటిమల మీద మెత్తని అలోవెరా జెల్‌ను రాసుకోండి. కొంత సమయం తర్వాత పరిశుభ్రమైన నీటితో కడిగేసుకుంటే సరిపోతుంది.
గ్రీన్ టీ టోనర్‌తో తాజాదనం
చర్మం ఆరోగ్యంగా, తాజాగా ఉండాలంటే రాత్రి పడుకునే ముందు టోనర్ అప్లై చేయడం మంచిది. ఇంట్లో గ్రీన్ టీతో సహజసిద్ధమైన టోనర్‌ను తయారు చేసుకోవచ్చు.
ఎలా వాడాలి: గ్రీన్ టీ పొడి తీసుకుని, అందులో కొంచెం రోజ్ వాటర్ కలిపి స్ప్రే బాటిల్‌లో నిల్వ చేసుకోండి. దీనిని క్రమం తప్పకుండా వాడితే మంచి ఫలితం ఉంటుంది.
పుదీనా, రోజ్ వాటర్‌తో ఉపశమనం
నుదుటిపై మొటిమలను తొలగించడానికి పుదీనాను కూడా మీ చర్మ సంరక్షణలో చేర్చవచ్చు.
ఎలా వాడాలి: 10 నుంచి 12 పుదీనా ఆకులను గ్రైండ్ చేసి, అందులో కొద్దిగా రోజ్ వాటర్ కలపండి. ఈ పేస్ట్‌ను మొటిమల మీద రాసి కొన్ని నిమిషాల తర్వాత సాధారణ నీటితో కడిగేయండి.
చేయకూడనివి
నుదుటిపై మొటిమలను రుద్దడం లేదా స్క్రబ్ చేయడం అస్సలు చేయవద్దు. ఇలా చేయడం వల్ల మొటిమలు మరింత ఎక్కువ కావచ్చు. పైన సూచించిన సహజ పద్ధతులను పాటించడం వల్ల మొటిమల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
By : Santhosh, Hyderabad
ఈ వార్తలు కూడా చదవండి :
-
Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ పై సంచలన ఆరోపణ.. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సూత్రధారి..!
-
UPI : ఫోన్ పే, గూగుల్ పే లో బ్యాలెన్స్ చెక్ చేస్తున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే..!
-
Viral Video : రెండు నెలల క్రితం వివాహం.. సెల్ఫీ దిగుదామని భర్తను నది ఒడ్డుకు తీసుకెళ్లిన భార్య.. (వీడియో)
-
Vaccine : మహిళలకు భారీ శుభవార్త.. ఆ వ్యాక్సిన్‌తో గర్భాశయ క్యాన్సర్‌కు చెక్.. అందరికి మేలు..!









