Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రైంBreaking Newsviralజాతీయం

Viral Video : రెండు నెలల క్రితం వివాహం.. సెల్ఫీ దిగుదామని భర్తను నది ఒడ్డుకు తీసుకెళ్లిన భార్య.. (వీడియో)

Viral Video : రెండు నెలల క్రితం వివాహం.. సెల్ఫీ దిగుదామని భర్తను నది ఒడ్డుకు తీసుకెళ్లిన భార్య.. (వీడియో)

మన సాక్షి, డెస్క్ :

రెండు నెలల క్రితం ఆ జంటకు వివాహమైంది. కొత్తజంట అత్తగారింటికి వెళ్లి వస్తున్నారు. మార్గమధ్యలో కృష్ణ నది వద్ద సెల్ఫీ దిగుదామని భర్తను అడిగింది. ఆ తర్వాత సీన్ కట్ చేస్తే ఏం జరిగిందో తెలుసుకుందాం.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కర్ణాటక రాష్ట్రం లోని దేవనూగూరు గ్రామానికి చెందిన తాతప్ప అతడి భార్య సుమంగళతో కలిసి భార్య స్వగ్రామమైన .. ఊరు నుంచి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. నారాయణపేట జిల్లా సరిహద్దు కర్ణాటక రాయచూరు జిల్లా కడలూరు వద్ద కు రాగానే కృష్ణా నదిపై వెళ్తుండగా సెల్ఫీ దిగుదామని భార్య భర్తను కోరింది.

దాంతో అతడు కాదనలేక సెల్ఫీ దిగినందుకు బైకును నిలిపి నది ఒడ్డుకు చేరారు. సెల్ఫీ దిగుతున్న క్రమంలో భర్తను నదిలోకి తోసింది సుమంగళ. నీటిలో కొట్టుకుపోయిన తాతప్ప ఈదుకుంటూ మధ్యలోనే బండరాలపైకి చేరాడు. స్థానికులు గమనించి తాళ్లు వేసి యువకుడిని కాపాడారు.

సుమారు 100 మీటర్ల దూరం నది మధ్యలో వెళ్లిన తాతప్ప బ్రిడ్జి పైకి చేరాడు. తాడు సహాయముతో యువకులు కాపాడడంతో తాను రక్షించబడ్డానని, భార్య తనని చంపడానికి సిద్ధంగా ఉందని అనుమానం వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. కానీ అతడి భార్య మాత్రం ప్రమాదవశాత్తు నదిలో పడిపోయాడని చెబుతుంది. బైక్ బైక్ పై స్వగ్రామం దేవనూగూరు కు బయలుదేరారు.

మరిన్ని వైరల్ వీడియోస్ చూడండి

  1. Viral Video : భార్యను తలకిందులుగా వేలాడదీసిన భర్త.. (వైరల్ వీడియో)

  2. Viral Video : మంగళ స్నానమా.. శోభనం రాత్రా.. ఇంత బరితెగింపా.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు (వైరల్ వీడియో)

  3. Viral Video : మెట్రో రైల్ లో నిద్రపోతున్న యువకుడు.. సమీపంలో ఉన్న యువతి ఏం చేసిందంటే.. (వీడియో)

  4. Viral Video : భార్య ముందే రైలులో నిద్రిస్తున్న మరో యువకుడితో.. ఛీ ఛీ.. ఇదేం పని రా..!

  5. Viral Video : ఛీ..ఛీ.. హైదరాబాద్ మెట్రోలో రొమాన్స్.. అడ్డంగా బుక్ అయిన ప్రేమ జంట..!

మరిన్ని వార్తలు