తెలంగాణBreaking Newsజిల్లా వార్తలురాజకీయంసూర్యాపేట జిల్లాహైదరాబాద్

MLC Addanki : డాక్టరేట్ అందుకున్న ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్..!

MLC Addanki : డాక్టరేట్ అందుకున్న ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్..!

మన సాక్షి, సూర్యాపేట :

ఉస్మానియా యూనివర్సిటీ చాన్సలర్, రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ , ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఇస్రో) చైర్మన్‌ వి.నారాయణన్‌ చేతుల మీదుగా డాక్టరేట్ పట్టాను ఎమ్మెల్సీ డాక్టర్ అద్దంకి దయాకర్ అందుకున్నారు.

మంగళవారం ఉస్మానియా యూనివర్సిటీ 84వ స్నాతకోత్సవం సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ సీనియర్ హెడ్ డాక్టర్ చెన్నప్ప నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేట్ హాస్పిటల్ లో మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్.. ఆసుపత్రిలో జరుగుతున్న పరిపాలన వ్యవహారాలే కాదు.. వాస్తవ పరిస్థితులపై పరిశోధనకు గాను ప్రతిష్టాత్మకం ఓయూ గౌరవ డాక్టరేట్‌ దక్కింది.

డాక్టరేట్ పట్టాను ఠాగూర్‌ ఆడిటోరియంలో యూనివర్సిటీ చాన్సలర్‌ రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ, ముఖ్యఅతిథిగా ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఇస్రో) చైర్మన్‌ వి.నారాయణన్‌ , ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ చేతుల మీదగా డాక్టరేట్ పట్టాను అందుకున్నారు. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ డాక్టరేట్ పొందడం పట్ల పలువురు సంతోషం వ్యక్తం చేస్తూ అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.

MOST READ : 

  1. Urea : యూరియా కొరత లేదు.. ఎరువుల గోదామును పరిశీలించిన జిల్లా సహకార అధికారి..!

  2. District collector : నానో యూరియా తో అధిక దిగుబడి.. రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశం..!

  3. Justice Sudarshan Reddy : ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి ఎవరో తెలుసా..!

  4. NH 65 : హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారి కిటకిట.. కొర్లపహాడ్ టోల్గేట్ వద్ద వాహనాల రద్దీ..!

మరిన్ని వార్తలు