Suryapet : పిల్లలమర్రి వాసికి వందేండ్ల ప్రఖ్యాత ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్..!
Suryapet : పిల్లలమర్రి వాసికి వందేండ్ల ప్రఖ్యాత ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్..!
సూర్యాపేట రూరల్, మనసాక్షి
సూర్యాపేట మున్సిపల్ పరిధిలోని 12వ వార్డు(పిల్లలమర్రి) కి చెందిన తుపాకుల భూషయ్య- రాములమ్మ ల కుమారుడు తుపాకుల శ్రీను మధుమేహంతో బాధపడుతున్న రోగుల్లో గుండె సంబంధిత వ్యాధులైన డయబెటిక్ కార్డియోమయోపథీ కి ప్రత్యామ్నాయ చికిత్సలను కనుగొనే దిశలో గుండె రుగ్మతల నివారణలో ఔషధ సస్యాల పాత్రపై డా. రాజు పాడియా పర్యవేక్షణలో విస్తృత పరిశోధనలు చేసి పలు జాతీయ అంతర్జాతీయ జర్నల్స్ ప్రచురితం చేసి సదస్సులో ప్రసంగించినందుకు ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ పట్టాను అందజేసింది.
ఈ పరిశోధన ఫలితాల వలన భవిష్యత్‌లో సహజమైన, దుష్ప్రభావాలు లేని చికిత్సా మార్గాల రూపకల్పనతో గుండె సంబంధిత రోగులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందనీ ఓయూ తెలిపింది. చిన్ననాటి నుండే శ్రీనివాస్ పల్లెల్లో పేదలకి ఆరోగ్యమైన జీవితం ఇవ్వడం కోసం ఏదో ఒకటి చేయాలన్న తపన.
తనని ఉన్నత చదువులు చదివేలా ముందుకు నడిపి పిల్లలమర్రి స్కూల్ లో మొదలైన తన విద్యాభ్యాసం పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీ నుండి పీజీ విద్యను అభ్యసించి, ఉస్మానియా యూనివర్సిటీ లో పీహెచ్డీ సాధించేలా చేసింది. శ్రీనివాస్ చేసిన పరిశోధనలకు డాక్టరేట్ పట్టా పొందినందుకు గాను మిత్రులు, ఉస్మానియా అభినందించారు.
MOST READ :
-
TG News : గ్రామ పాలన అధికారుల పరీక్షకు ఏర్పాట్లు పూర్తి.. ఇవీ పరీక్షకు తీసుకరావల్సినవి, తీసుకరాకూడనివి..!
-
Modi : ప్రధానమంత్రిగా మోడీ సరికొత్త రికార్డ్.. ఇందిరాగాంధీ రికార్డు బ్రేక్ చేసిన మోదీ..!
-
Gold Price : వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే.. లేటెస్ట్ అప్డేట్..!
-
Shadnagar : షాద్ నగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. తండ్రి కూతుళ్లు మృతి..!









