Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

Suryapet : గొర్రెల మందలపై కుక్కల దాడి..!

Suryapet : గొర్రెల మందలపై కుక్కల దాడి..!

అర్వపల్లి, మన సాక్షి ;

గొర్రెల మంద పై అర్ధరాత్రి దాడి చేసిన కుక్కలు, పది గొర్రెలు మృతి చెంది, ఆరు గొర్రెలు తీవ్ర గాయాలు అయిన సంఘటన మండల పరిధిలోని కొమ్మాల గ్రామంలో జరిగింది. బాధిత రైతు గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని కొమ్మాల గ్రామానికి చెందిన పగిడి వీరయ్య తన గొర్రెలను ఉదయం నుండి సాయంత్రం వరకు మేపుకొని, రాత్రి సమయంలో ఇంటి పరిసరాలలోని గొర్రెల మందలో ఉంచినట్లు తెలిపారు.

అర్ధరాత్రి సమయంలో వీధి కుక్కలు ఒక్కసారి గొర్రెల మందుల పైబడి విచక్షణ రహితంగా గొర్రెలను చంపేసినట్లు తెలిపారు.దాడి సమయంలో 10 గొర్రెలు చనిపోగా, మరికొన్ని గొర్రెలు తీవ్రంగా గాయపడి చావు బతుకుల మధ్య ఉన్నట్లు తెలిపారు. గొర్రెల పెంపకం దారునికి 2 లక్షల రూపాయల వరకు నష్టం జరిగినట్లు తెలిపారు. గొర్రెల పెంపకం ద్వారా జీవిత వెలదీస్తున్న వారికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని గ్రామస్తులు కోరారు.

గ్రామాలలో ఉన్న వీధి కుక్కలను వెంటనే నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. గ్రామాలలో కోతులు వీధి కుక్కల ద్వారా ప్రజలకు అనేక ఇబ్బందులు కలుగుతున్నట్లు ఆరోపించారు. వీధి కుక్కలను వెంటనే నిర్మించాల్సిందిగా అధికారులను కోరారు.

MOST READ : 

  1. Suspended : జిల్లా కలెక్టర్ సంచలన ఆదేశాలు.. లైంగిక వేధింపుల ఘటనలో ప్రధానోపాధ్యాయురాలు సస్పెన్షన్..!

  2. Cyber crime : టీవీ రీఛార్జ్ కోసం ఫోన్ చేస్తే రూ.99 వేలు కొట్టేశారు..!

  3. Wines Tenders : మద్యం టెండర్లలో భార్యాభర్తలను వరించిన అదృష్టం..!

  4. Wines Tenders : అదృష్టవంతుడు అంటే ఇతడే.. ఐదు వైన్స్ లకు టెండర్లు వేస్తే ఐదు దక్కాయి..!

మరిన్ని వార్తలు