Fake Certificates : నకిలీ సర్టిఫికెట్ల దందా.. SSC నుంచి BeTech వరకు, ఏదైనా సాద్యమే ఇక్కడ..!

Fake Certificates : నకిలీ సర్టిఫికెట్ల దందా.. SSC నుంచి BeTech వరకు, ఏదైనా సాద్యమే ఇక్కడ..!
జగిత్యాల, (మన సాక్షి) :
నకిలీ సర్టిఫికెట్ల దందా జగిత్యాల జిల్లాలో జోరుగా సాగుతోంది. పదవ తరగతి నుంచి బీటెక్ వరకు ఏ సర్టిఫికెట్ అయినా ఈజీగా వచ్చేస్తుంది. విషయం తెలుసుకున్న జగిత్యాల జిల్లా కోరుట్ల పోలీసులు నకిలీ సర్టిఫికెట్ల గుట్ట రట్టు చేశారు.
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన రుద్ర వేణుగోపాల్ పోచమ్మ వాడ లో మంత్ర ఆన్లైన్ సెంటర్ నడిపిస్తూ గత రెండు సంవత్సరాల నుండి ఫోటోషాప్ ద్వారా దొంగ సర్టిఫికెట్లు ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీ, బీటెక్ మెమోలు, నకిలీ డెత్ సర్టిఫికెట్లు తయారు చేస్తూ అవసరం ఉన్నవారికి వాటిని అమ్ముతూ అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నారు.
నమ్మదగిన సమాచారం మేరకు కోరుట్ల పోలీసులు,సి సి ఎస్ పోలీస్ వారు జాయింట్ గా నిందితుడి షాప్, మంత్ర ఆన్లైన్ సెంటర్ పైనా ఆకస్మిక దాడి చేసి నిందితుడు వేణుగోపాల్ నీ పట్టుకొని అతని వద్ద నుండి 106 నకిలీ సర్టిఫికెట్లు (10వ , ఇంటర్, డిగ్రీ, పీజీ,బీ టెక్, బర్త్, డెత్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు, ఒక కంప్యూటర్ ఒక ప్రింటర్ పేపర్ కటింగ్ మిషన్ లామినేషన్ మిషన్ ఒక మానిటర్ స్వాధీన పరుచుకుని, అతని మీద కేసు నమోదుచేసి, నిందితున్ని రిమాండ్ కి తరలించామని కోరుట్ల పోలీసులు తెలిపారు.
నకిలీ సర్టిఫికేట్ల తయారు చేస్తున్న నిందితుని అరెస్ట్ చేయడంలో కృషి చేసిన సీ.ఐ సురేష్ బాబు, సిసి ఎస్ఇ న్స్పెక్టర్ యం. శ్రీనివాస్, ఎస్సై చిరంజీవి, సి సి ఎస్ ఎస్సై కె. రాజు, కానిస్టేబుల్ లు అఫ్రోజ్, సాజిద్, వినోద్, సురేష్, కమలాకర్ లను ఎస్పీ అశోక్ కుమార్ అభినందించారు.
MOST READ :
-
District collector : జిల్లా కలెక్టర్ హెచ్చరిక.. వారిపట్ల అమర్యాదగా ప్రవర్తిస్తే చర్యలు..!
-
Ration Cards : కొత్త రేషన్ కార్డుదారులకు బంపర్ ఆఫర్.. ప్రభుత్వం తాజా నిర్ణయం..!
-
Miryalaguda : కొత్తగా 15 వేల రేషన్ కార్డులు.. రాని వారికి మళ్లీ ధరఖాస్తుకు అవకాశం..!
-
Nalgonda : నల్గొండ జిల్లాలో వెలుగులోకి మానవ అక్రమ రవాణా.. వెట్టి చాకిరి.. ముఠా అరెస్ట్..!
-
District collector : జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి తక్కువ ధరలకు ఇటుకలు.. రేట్ ఫిక్స్..!









